Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్యతో సఖ్యంగా లేను సునీతను త్వరలోనే పెళ్లి చేసుకుంటా : సీఐ మల్లికార్జున రెడ్డి

మంగళవారం, 23 జనవరి 2018 (15:46 IST)

Widgets Magazine
ci mallikarjuna reddy

తమ మధ్య వివాహేతర సంబంధం లేదనీ కానీ మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకుందామని భావించామని కల్వకుర్తి సీఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు. ఆయన అవినీతి నిరోధక శాఖలో ఏఎస్పీగాగా పని చేసే సునీతా రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఈ విషయాన్ని సునీతా రెడ్డి భర్త స్వయంగా పట్టుకుని ఆమె బంధువులకు అప్పగించారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనమైంది. 
 
ఇదిలావుంటే, కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డి వివరణ పేరుతో ఒక వాట్సప్‌ సందేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో తమకు వివాహేతర సంబంధం లేదని, అధికారికంగానే పెళ్లి చేసుకుందామని అనుకున్నామని మల్లికార్జునరెడ్డి చెపుతున్నట్టుగా ఉంది. ఆదివారం రాత్రి సునీతారెడ్డిని ఇంటి వద్ద డ్రాప్‌ చేయడానికి వెళ్లానని అందులో పేర్కొన్నారు.
 
'సునీతతో నాకు ఐదేళ్లుగా పరిచయం ఉంది. ఆమె విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. విడాకులు మంజూరైన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాం. సునీతారెడ్డి భర్తకు ఈ విషయాలన్ని చెప్పాను' అని మల్లికార్జున్‌ రెడ్డి అన్నట్లు వాట్సప్‌ సందేశంలో ఉంది. 
 
తన భార్యతో సఖ్యంగా లేనని, త్వరలోనే మీడియా ముందుకు ఇద్దరం వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తామని మల్లికార్జున్‌ అన్నట్లు అందులో పేర్కొన్నారు. కాగా, ఈ వ్యవహారంపై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీంతో సీఐ మల్లికార్జున్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు. అలాగే, సునితారెడ్డిపై కూడా చర్య తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సీఐతో నా భార్య ఏఎస్పీ సునీతారెడ్డికి అక్రమ సంబంధం.. భర్త సురేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని సీఐ మల్లికార్జున రెడ్డికి, అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ ...

news

జై తెలంగాణ నినాదం.. వందేమాతరం కంటే పవర్‌ఫుల్ : పవన్ కళ్యాణ్

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ చేసిన జై తెలంగాణ నినాదం దేశ స్వాతంత్ర్యం ...

news

బాయ్‌ఫ్రెండ్‌లో మలియా ఒబామా ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్

తాజాగా మాలియా ఒబామా ప్రేమికుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ ...

news

బీజేపీతో తెగదెంపులు.. 2019లో ఒంటరిగానే : శివసేన

మహారాష్ట్రలో బీజేపీ - శివసేన పార్టీల మధ్య ఉన్న స్నేహబంధం తెగిపోయింది. వచ్చే యేడాది జరిగే ...

Widgets Magazine