Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కర్నాటకలో 'పందెం కోళ్లు'లా మెగా బ్రదర్స్... ఏంటి సంగతి?

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (21:22 IST)

Widgets Magazine
pawan-chiru

మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరూ ఎడమొహం, పెడ మొహం అందరూ అనుకుంటారు. కానీ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు ఒక్కరేనని ఎప్పుడూ చెబుతుంటారు తెలుగు సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులు. రాజకీయాల్లో వేర్వేరు పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా ఇద్దరూ ఒక్కటే. సినీ పరిశ్రమలో ఒకరిని చూసి ఒకరికి అవకాశం రాదు కానీ.. ఎవరు టాలెంట్ వారిదేనన్నది అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరికి ఉన్న గుర్తింపు గురించి అస్సలు చెప్పనవసరం లేదు. 
 
చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా, పవన్ కళ్యాణ్‌ జనసేనతో ఎపి, తెలంగాణా రాష్ట్రాల్లో బిజీబిజీగా పర్యటనలు కొనసాగించారు. కానీ తాజాగా వీరిద్దరు కలిసి వేర్వేరుగా కర్ణాటక రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారట. కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి ప్రచారం నిర్వహిస్తుండగా, జెడీఎస్ తరపున పవన్ కళ్యాణ్‌ ప్రచారం చేయనున్నారు. తెలుగు యాక్టర్లను కన్నడ రాష్ట్రంలో తీసుకెళితే ప్రయోజనం ఏం ఉంటుందని అనుకోవచ్చు. అస్సలు కథ ఇక్కడే ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దులోనే కర్ణాటక రాష్ట్రం ఉంది. తెలుగు హీరోల ప్రభావం ఈ రాష్ట్రంపై బాగానే ఉంది. అందుకే వీరిని రంగంలోకి దింపుతున్నారు ఆయా పార్టీల ముఖ్య నేతలు.
 
అన్నదమ్ములు వేర్వేరుగా ప్రచారం చేస్తే ఒకరికి ఒకరు ఎలాంటి ప్రసంగాలు చేస్తారోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు చిరంజీవి ప్రచారం చేయాల్సిన రూట్‌ను కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. వీరి ప్రచారం మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం.. ఆ పార్టీ నుంచే అంటోన్న కలెక్షన్ కింగ్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈయన ఎక్కడ మాట్లాడినా అది సెన్సేషనలే. అదిరిపోయే డైలాగ్‌లతో ...

news

వృద్ధులు, పెద్దవాళ్లు పనికిరానివాళ్లా? ఐతే ఇక్కడ చూడండి...

ఈ ఆధునిక ప్రపంచంలో ఉమ్మడి కుటుంబం అనేది చాలా అరుదుగా కనపడుతుంది. ఉమ్మడి కుటుంబము అనగానే ...

news

బీజేపీతో ఇంకా అంటకాగితే చిత్తుగా ఓడిస్తారు : చంద్రబాబుతో నేతలు

ఇప్పటికీ మునిగిపోయిందీ లేదు.. బీజేపీతో ఉన్న స్నేహ బంధానికి కటీఫ్ చెప్పేద్ధాం. లేకుంటే ...

news

కేంద్ర బడ్జెట్ పైన నారా బ్రహ్మిణి పొగడ్తలు... తెదేపా నేతలు షాక్...

కేంద్ర బడ్జెట్ పైన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తే ...

Widgets Magazine