Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పయ్యావుల కేశవ్‌కు కెసిఆర్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదేనట...

బుధవారం, 4 అక్టోబరు 2017 (15:41 IST)

Widgets Magazine
payyavula keshav

పరిటాల శ్రీరామ్ వివాహం కంటే ఆ వివాహానికి వచ్చిన పయ్యావుల కేశవ్, కెసిఆర్‌లు కలవడం మాత్రం తీవ్ర చర్చకు తెరతీసింది. అందులోను హెలిప్యాడ్ వద్ద కెసిఆర్, పయ్యావుల కేశవ్‌ను చేతులు పట్టుకుని మరీ తీసుకెళ్ళడం మరింత చర్చకు దారితీసింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పయ్యావుల కేశవ్ పార్టీపై కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఈ నాయకుడు ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
 
గతంలో కెసిఆర్‌కు పయ్యావుల కేశవ్‌కు మధ్య మంచి పరిచయాలే ఉన్నాయి. ఆ పరిచయం కాస్త కొన్నిరోజుల క్రితం అనంతపురంకు వచ్చిన సమయంలో కేశవ్‌కు బాగానే కలిసొచ్చింది. హైదరాబాద్ కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పయ్యావుల కేశవ్‌కు కెసిఆర్ అవకాశం ఇచ్చారట. హైదరాబాద్‌కు వచ్చెయ్.. ఆ ప్రాంతం నీకేమీ కొత్తకాదు. 
 
వచ్చే ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి గెలుస్తావు. ఆ తరువాత మంత్రి పదవి నీకు ఖాయం. నా మాట విను అంటూ చెప్పుకొచ్చారట. అయితే పయ్యావుల కేశవ్ మాత్రం దీనిపై ఆలోచనలో పడిపోయినట్లు సమాచారం. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది. అందులోను అనంతపురం జిల్లాలో ఉండే తను హైదరాబాద్‌కు వెళితే ఎలా ఉంటుందోనన్న ఆలోచనలో ఉండిపోయారు కేశవ్. కాస్త ఆలోచించుకునే సమయం ఇవ్వండని కెసిఆర్‌ను కోరినట్లు చెప్పుకుంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'We're all in 2017 while she's in 3017' : వాకిలిని ఇలా శుభ్రం చేయొచ్చు (Video)

సాధారణంగా ఇంటి వాకిలిని మహిళలు నడుం వంచి చీపురుతో శుభ్రం చేస్తుంటారు. అయితే, పెద్ద పెద్ద ...

news

ఆరునూరైనా పాదయాత్రకే జగన్ మొగ్గు.. అధికార పార్టీకి అస్త్రమేనా?

రాష్ట్రంలోని ప్రధానప్రతిపక్షమైన వైకాపా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ముందు ...

news

టిటిడి ఆలయంలో అస్థికలు బయటపడుతున్నాయి...

చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వేద నారాయణస్వామి ఆలయంలో మట్టి తవ్వుతుంటే అస్థికలు ...

news

'బాలయ్యా ఇదేం గోలయ్యా' అంటూ మండిపడుతున్న నెటిజన్లు (Video)

సినీ నటుడు బాలకృష్ణ మరోమారు రెచ్చిపోయారు. తనకు కోపం వస్తే ఎలా రెచ్చిపోతోనో మరోమారు ...

Widgets Magazine