సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 18 జూన్ 2019 (11:20 IST)

అసెంబ్లీలో ట్రాఫిక్ జాం చేస్తున్న రోజా

రోజా... వైసీపీ ఫైర్ బ్రాండ్. ఎవర్నైనా... ఏ ఇష్యు అయినా సూటిగా.. సుత్తి లేకుండా అవలీలగా దుమ్ము దులిపేయగల నేత. ఆమె అసెంబ్లీకి వచ్చిందంటే చాలు.. లాబీల్లో సందడే సందడి. ఆమెతో సెల్ఫీల కోసం అసెంబ్లీ స్టాఫ్.. పోలీసులు.. అసెంబ్లీ చూడ్డానికి వచ్చే వైసీపీ నేతలు.. కార్యకర్తలు ఎగబడుతున్నారు. 
 
లాబీల్లో రోజా ఉందంటే చాలు ఆమె చుట్టూ వందమంది పోగవుతున్నారు. సెల్ఫీల కోసం పోటీపడుతున్నారు. రోజా అభిమానుల దెబ్బకు అసెంబ్లీ లాబీలు జామ్ అయిపోతున్నాయి. మంత్రులు.. ఎమ్మెల్యేలు అటూఇటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ట్రాఫిక్ జాంలో మంత్రులు జయరాములు.. ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా చిక్కుకున్నారు. 
 
రోజా సినిమాలు మానేసి చాలా రోజులైంది.. బాలకృష్ణ ఇంకా సినిమాల్లో కొనసాగుతున్నారు. కానీ ఆయన్ను సెల్పీ అడిగే ధైర్యం ఎవరూ చేయకపోవడం విశేషం. రోజా వెంట మేడం మేడం ఒక్క సెల్ఫీ అంటూ వెంటపడుతున్నారు. రోజా అభిమానుల తాకిడి చూసి కొంతమంది ఎమ్మెల్యేలు... అక్కా మీరు ట్రాఫిక్ జామ్ చేసేస్తున్నారు అంటూ జోక్‌లు వేస్తున్నారు. మొత్తానికి రోజా అసెంబ్లీ బయట ఉన్నా లోపల ఉన్నా సంచలనమే.