Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రేవంత్ రెడ్డి, చంద్రబాబు జైలుకు వెళ్ళాల్సిందే: టీఆర్ఎస్ విప్

గురువారం, 23 నవంబరు 2017 (13:19 IST)

Widgets Magazine

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు, ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పదని.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. సన్ బర్న్ షో, మ్యూజిక్ ప్రోగామ్‌లకు తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆయన బావమరిదికి ఎలాంటి సంబంధం లేదని.. ఈ తప్పుడు ఆరోపణలను నిరూపించలేకపోతే.. రేవంత్ రెడ్డి ముక్కుకు నేలకు రాయాలని సవాల్ విసిరారు. రాజీనామా డ్రామాకు రేవంత్ రెడ్డి తెరదించాలని పల్లా రాజేశ్వరి రెడ్డి అన్నారు. 
 
రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన రాజీనామా లేఖను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఇవ్వాలని సవాల్ విసిరారు. అలాగాకుండా అమరావతిలో ఉండే ఏపీ సీఎంకు రాజీనామా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. నెల రోజులు జైలులో ఉన్న రేవంత్ రెడ్డి నేర స్వభావంతో మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఊసరవెల్లిలా అనేక పార్టీలు మారారని విమర్శించారు.  
 
హైద‌రాబాద్‌లో స‌న్ బ‌ర్న్ పేరుతో పార్టీ నిర్వ‌హించేందుకు ఓ ప‌బ్‌కి అనుమతులు ఇచ్చారన్న రేవంత్ ఆరోపణలను పల్లా ఖండించారు. కొత్త పబ్బులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకాట క్లబ్‌లు మూతపడ్డాయని గుర్తుచేశారు.
 
హైదరాబాద్ నగరం డ్రగ్స్ జోన్‌లో లేదని నార్కోటిక్స్ విభాగం స్పష్టం చేసిన విషయాన్ని కూడా పల్లా ఈ సందర్భంగా గుర్తు చేశారు. నగరం డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారిందని వెల్లడించారు. ఒకప్పుడు చంద్రబాబు వేసిన బొక్కలు తిని రేవంత్ కుక్కలా పనిచేశాడని ఫైర్ అయ్యారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

లక్ష్మీపార్వతి నన్ను చంపేస్తానంటోంది... దర్శకుడు కేతిరెడ్డి

వైసిపి నేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రెండవ భార్య లక్ష్మీపార్వతి చరిత్రపై ...

news

నువ్వు కావాలంటే రాహుల్‌ గాంధీకి భజన చెయ్: హార్టిక్‌పై నితిన్ ఫైర్

గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధిస్తే పటీదార్ రిజర్వేషన్ ఫార్ములాను అమలు చేస్తామని కాంగ్రెస్ ...

news

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ..?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు రంగం ...

news

చాక్లెట్లు, డబ్బు ఆశ చూపి బాలికలపై రేప్... వృద్ధుడి నిర్వాకం

అభంశుభం తెలియని చిన్నారులకు చాక్లెట్లు, డబ్బు, ఇతర వస్తువులు ఆశచూపి ఓ 85 యేళ్ళ వృద్ధుడు ...

Widgets Magazine