శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (18:20 IST)

రౌండ్ల వారీగా నంద్యాల ఓటరు తీర్పు : నోటా ఓట్లతో పోటీపడిన కాంగ్రెస్ అభ్యర్థి

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక పోరులో ఓటరన్న విస్పష్ట తీర్పునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డి ఘనం విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మరోమాడు డిపాజి

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక పోరులో ఓటరన్న విస్పష్ట తీర్పునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డి ఘనం విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మరోమాడు డిపాజిట్‌ను కోల్పోయారు. ఒక విధంగా చెప్పాలంటే నోటా ఓట్లతో పోటీపడ్డారు. 
 
రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయిన విషయం తెల్సిందే. 2014లో జరిగిన ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదు. ఇపుడు అంటే సుమారు మూడున్నరేళ్ళ తర్వాత జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో కూడా ఆ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకోలేక పోయింది. 
 
అంటే.. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని చెప్పొచ్చు. ఒక జాతీయ పార్టీగా ఉండి కూడా కనీస స్థాయిలో ఓట్లను రాబట్టుకోలేక డిపాజిట్లు కోల్పోయింది. ఆ పార్టీకి మొత్తం 1029 ఓట్లు మాత్రమే రావడంతో అసలు ఎవరికీ ఓటేయకుండా ఉండే " నోటా " మీట మీద నొక్కిన వాళ్ళతో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ పడ్డారంటూ జోకులు పేలుతున్నాయి.
 
కాంగ్రెస్ తన అభ్యర్థిని బరిలోకి లేటుగా దించడమే ఈ పరిస్థితికి ఒక కారణమని ఆ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి తమ పరిస్థితిని సమర్థించుకోవడం గమనార్హం. అయితే కాంగ్రెస్ ఒక మైనారిటీ అభ్యర్థిని దింపి ముస్లిం ఓట్లకోసం ప్రయత్నించినప్పటికీ వ్యూహం బెడిసికొట్టిందని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. 
 
ఇకపోతే.. 2019 ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించిన నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై 27,466 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 19 రౌండ్ల కౌంటింగ్ జరిగితే కేవలం 16వ రౌండ్‌లో మాత్రమే వైసీపీ ఆధిక్యత సాధించింది. మిగిలిన 18 రౌండ్లలో సైకిల్ జోరు ముందు వైసీపీ నిలవలేక పోయింది.
 
రౌండ్లవారీగా ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు, ఆధిక్యత వివరాలు ఇవే.
 
1వ రౌండ్ - టీడీపీకి 5477 ఓట్లు - వైసీపీకి 4279 ఓట్లు - కాంగ్రెస్ కు 69 ఓట్లు - టీడీపీ ఆధిక్యత 1198 ఓట్లు
2వ రౌండ్ - టీడీపీకి 5162 - వైసీపీకి 3400 - కాంగ్రెస్ పార్టీకి 73 - టీడీపీ ఆధిక్యత 1762
3వ రౌండ్ - టీడీపీకి 6640 - వైసీపీకి 3553 - కాంగ్రెస్‌కు 77 - టీడీపీ ఆధిక్యత 3087
4వ రౌండ్ - టీడీపీకి 6465 - వైసీపీకి 2859 - కాంగ్రెస్‌కు 56 - టీడీపీ ఆధిక్యత 3606
5వ రౌండ్ - టీడీపీకి 6975 - వైసీపీకి 3563 - కాంగ్రెస్‌కు 87 - టీడీపీ ఆధిక్యత 3412
6వ రౌండ్ - టీడీపీకి 6161 - వైసీపీకి 2829 - కాంగ్రెస్‌కు 69 - టీడీపీ ఆధిక్యత 3332
7వ రౌండ్ - టీడీపీకి 4859 - వైసీపీకి 4312 - కాంగ్రెస్‌కు 55 - టీడీపీ ఆధిక్యత 547
8వ రౌండ్ - టీడీపీకి 4436 - వైసీపీకి 4088 - కాంగ్రెస్‌కు 51 - టీడీపీ ఆధిక్యత 348
9వ రౌండ్ - టీడీపీకి 4309 - వైసీపీకి 3430 - కాంగ్రెస్‌కు 65 - టీడీపీ ఆధిక్యత 879
10వ రౌండ్ - టీడీపీకి 4642 - వైసీపీకి 3622 - కాంగ్రెస్‌కు 51 - టీడీపీ ఆధిక్యత 1486
11వ రౌండ్ - టీడీపీకి 4226 - వైసీపీకి 3622 - కాంగ్రెస్‌కు 51 - టీడీపీ ఆధిక్యత 604
12వ రౌండ్ - టీడీపీకి 5629 - వైసీపీకి 4359 - కాంగ్రెస్‌కు 84 - టీడీపీ ఆధిక్యత 1270
13వ రౌండ్ - టీడీపీకి 5690 - వైసీపీకి 4235 - కాంగ్రెస్‌కు 76 - టీడీపీ ఆధిక్యత 1460
14వ రౌండ్ - టీడీపీకి 5172 - వైసీపీకి 3268 - కాంగ్రెస్‌కు 77 - టీడీపీ ఆధిక్యత 1304
15వ రౌండ్ - టీడీపీకి 5770 - వైసీపీకి 4328 - కాంగ్రెస్‌కు 89 - టీడీపీ ఆధిక్యత 1442
16వ రౌండ్ - టీడీపీకి 4663 - వైసీపీకి 5317 - కాంగ్రెస్‌కు 0 - వైసీపీ ఆధిక్యత 654
17వ రౌండ్ - టీడీపీకి 5163 - వైసీపీకి 4248 - కాంగ్రెస్‌కు 0 - టీడీపీ ఆధిక్యత 915
18వ రౌండ్ - టీడీపీకి 4467 - వైసీపీకి 3961 - కాంగ్రెస్‌కు 0 - టీడీపీ ఆధిక్యత 506
19వ రౌండ్ - టీడీపీకి 951 - వైసీపీకి 554 - కాంగ్రెస్‌కు 0 - టీడీపీ ఆధిక్యత 397