శోభనం అర్థరాత్రి వరకు భర్తతో... ఆ తరువాత ప్రియుడితో జంప్.. ఎక్కడ?
నిజమైన ప్రేమ ఎప్పటికీ నిలుస్తుందని పెద్దలు చెబుతుంటారు. తల్లిదండ్రులు బలవంతంగా ప్రేమించుకున్న జంటను విడదీసి వివాహం చేసినా వారు ఖచ్చితంగా విడిపోయి ఎప్పుడో ఒకసారి కలవడం ఖాయం. అలాంటి సంఘటనే చిత్తూరులో జరిగింది. పెళ్ళయిన రోజు రాత్రే భర్తతో అర్థరాత్రి వరకు గడిపి ఆ తరువాత ప్రియుడితో పరారైంది ఓ వివాహిత.
గిరింపేటకు చెందిన రంజిత్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన 23 యేళ్ళ ఒక యువతిని ఇచ్చి వివాహం చేశారు. వివాహం ఎంతో ఆర్భాటంగా జరిగింది. అయితే యువతి తన పెళ్ళికి ముందు గాంధీవీధికి చెందిన మరో యువకుడితో నాలుగేళ్ళుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలుసు. తమ కుమార్తె ప్రేమించిన యువకుడు బలాదూర్‌గా తిరుగుతూ ఉండటంతో అతనికి ఇచ్చి పెళ్ళి చేయడం ఇష్టం లేక బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు.
అయితే ఆ యువతి పెళ్ళయితే చేసుకుంది కానీ భర్తతో సంసారం చేయలేకపోయింది. శోభనం రోజు అర్థరాత్రి వరకు భర్తతో ఉన్న ఆ వివాహిత ఆ తరువాత ప్రియుడితో కలిసి పారిపోయింది. అయితే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు తల్లిదండ్రులు. తమ పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో విషయం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తపడ్డారు. కానీ బంధువుల ద్వారా అసలు విషయం బయటకు వచ్చేసింది. ప్రియుడితో పారిపోయిన యువతి కోసం బంధువులే వెతుక్కుంటున్నారు.