Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎవ్వరినీ మరిచిపోను... శేఖర్ కమ్ములను వదిలిపెట్టను : పవన్ కళ్యాణ్

గురువారం, 7 డిశెంబరు 2017 (10:46 IST)

Widgets Magazine
pawan kalyan

మెగా హీరో వరుణ్ తేజ్‌కు బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ దర్శకుడిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పగబట్టారు. ఆయన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు వారికి తగిన విధంగా చెపుతానంటూ హెచ్చరించారు. అసలు శేఖర్ కమ్ములపై పవన్‌కు ఎందుకు అంత కోపమో ఇపుడు తెలుసుకుందాం. 
 
విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకు చెందిన జనసేన కార్యకర్తలతో పవన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో నేను నరేంద్ర మోడీని కలిసినప్పుడు 'పవన్‌ కల్యాణ్‌ ఎవడు' అని హైదరాబాద్ ఎంపీ, ఐఎంఐ అధ్యక్షుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. నరేంద్ర మోడీని కలిస్తే ద్రోహం చేసినట్లు మాట్లాడారు. దర్శకుడు శేఖర్‌ కమ్ముల వంటి వారు కూడా ట్వీట్‌ చేశారు. ఏదీ మరిచిపోలేదు. సమయం, సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాను. ఈ రోజు నేను మోడీని గట్టిగా నిలదీస్తున్నాను. మరి... మీరు అలా మాట్లాడుతున్నారా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
 
అంతేకాకుండా, ఇపుడున్న రాజకీయ పార్టీల్లో జాతీయ దృక్పథం ఏదని ప్రశ్నించారు. ఇప్పుడు ఒక్కో పార్టీ ఒక కులానికి ప్రతీక అయిపోయింది. బీజేపీ హిందూ పార్టీ అయిపోయింది. ఇలాకాకుండా... ఒక జాతీయ దృక్పథం ఉన్న పార్టీలు ఎందుకు ఉండవు? అని పవన్ ప్రశ్నించారు. 
 
అలాగే, ఇటీవల తాను లండన్‌కు వెళ్లినప్పుడు ఒక పారిశ్రామికవేత్త తన మొబైల్‌ ఫోన్‌లో షేర్‌ అయిన ఫొటోలు చూపించారు. వైసీపీ లక్ష కోట్లు దోచుకుందని టీడీపీ, టీడీపీయే దోచుకుందని వైసీపీ పెట్టిన ఫొటోలవి. "చెరో లక్షకోట్లు దోచుకుంటే ప్రజలకు ఏం చేస్తారు? రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఎలా వస్తాం" అని ఆయన ప్రశ్నించారు. నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Janasena Pawan Kalyan Janasena In Uttarandhra Sekhar Kammula Tweets

Loading comments ...

తెలుగు వార్తలు

news

తిరుపతికి వస్తూ తిరిగిరాని లోకాలకు....

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ...

news

బెడ్‌పై "ఆ" భంగిమలో భార్య.. నిలదీన భర్తను చంపి సెప్టిక్ ట్యాంకులో...

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి తమ ఇంట్లోని పడకగదిలో ...

news

ఆ నేతల చర్మం ఏనుగు చర్మంలా తయారైంది : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార తెలుగుదేశం పార్టీతో పాటు.. దాని మిత్రపక్షమైన బీజేపీలకు ...

news

సిబిఐటీలో అవినీతి.. విద్యార్థులపై ఫీజు బండ

హైదరాబాద్‌ గండిపేటలోని సిబిఐటి కళాశాలలో బుధవారం నాడు విద్యార్థినీవిద్యార్థులు ధర్నా ...

Widgets Magazine