బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (10:47 IST)

సినిమా ఇండ‌స్ట్రీని ప్ర‌క్షాళ‌న చేయాలి : ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య

'తెలుగు సినీ ఇండస్ట్రీలో లైంగిక, ఆర్థిక దోపిడీ' అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లోని బషీర్ బాగ్‍ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ... సమ

'తెలుగు సినీ ఇండస్ట్రీలో లైంగిక, ఆర్థిక దోపిడీ' అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లోని బషీర్ బాగ్‍ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ... సమాజాన్ని ప్రభావితం చేసే బలమైన సాధనం సినిమా. హీరోలు, దర్శకులు, నిర్మాతలు తెరవెనుక చేస్తున్న అఘాయిత్యాలు సినీ ఇండస్ట్రీకి సిగ్గుచేటు. సినీ పరిశ్రమకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి అన్నారు.
 
సినిమా ఇండస్ట్రీలో కనిపించని వివక్ష, దోపిడీ, పీడన కొనసాగుతుంది. సినిమా ఇండస్ట్రీని ప్రక్షాళన చేయాలి. సినీ కళాకారుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదిస్తా అని చెప్పారు. హీరోలకు ధైర్యం లేదు, శక్తి లేదు, తెలివి లేదు. కొడుకులను ఒక్కొక్కరిని ఉరికిస్తాం. హీరోలంతా నిజ జీవితంలో కుక్కను చూస్తే కూడా పారిపోతారు. 
 
తెలుగు సినిమా హీరోల దగ్గర వందల ఎకరాలు ఉన్నాయి. మర్యాదగా అవి ఇస్తే ఏమి కాదు లేదంటే గుడిసెలు వేయిస్తా. సినీ పరిశ్రమ తిరోగమన దిశగా వెళ్తుంది. ఇండస్ట్రీలో జరుగుతున్న అకృత్యాలపై ప్రభుత్వం కమిటీ వేయాలి. స్టూడియోలలో ఏం జరుగుతుందో పర్యవేక్షణ లేదు. సినిమా మంత్రిత్వ శాఖకు అసలు పట్టింపు లేదు అటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.