Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అన్నంతపని చేసిన కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి!

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (13:02 IST)

Widgets Magazine
Renuka Chowdhury

తెలంగాణ ఆడబిడ్డ, కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి అన్నంతపని చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై రాజ్యసభలో హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ, ఆధార్‌కు పునాది వేసింది తామేనని వ్యాఖ్యానించారు. ఈ మాటలకు రేణుకా చౌదరి బిగ్గరా నవ్వారు. రేణుక నవ్వడంపై ప్రధాని సభలో స్పందిస్తూ, 'రామాయణం సీరియల్ తర్వాత ఇంత నవ్వు వినే భాగ్యం నాకు దక్కింది..' అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అన్ని విపక్ష పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ.. రేణుకా చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, తదనంతరం కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిరణ్ రిజిజు వివాదాస్పద పోస్టు ఫేస్‌బుక్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. రామాయణం సీరియల్‌లోని శూర్ఫణఖ పాత్ర నవ్వుతున్న వీడియోకి.. మోడీ మాట్లాడిన సమయంలో రేణుకా చౌదరి నవ్వుతున్న దృశ్యాలను ఆయన జత చేశారు. దీనిపై రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాజ్యసభలో తన నవ్వుపై మోడీ వ్యాఖ్యలను జతచేస్తూ.. రిజిజు వీడియో పోస్టుపై హక్కుల తీర్మానం ఆమె ప్రవేశపెట్టారు. 'ఇది ఓ మహిళను అవమానించడమే కాదు, తీవ్ర అభ్యంతరకరం కూడా... దీనిపై నేను హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాను' అని రేణుక పేర్కొన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
రేణుకా చౌదరి నరేంద్ర మోదీ రాజ్యసభ కిరణ్ రిజిజు హక్కుల నోటీసు కాంగ్రెస్ Kiren Rijiju Ramayana Post Renuka Chowdhury Privilege Notice

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాబు పెద్ద తప్పేమీ చేయలేదు.. జైలుకెళ్తే ఓట్లు రాలుతాయ్: ఉండవల్లి

ఏపీ సీఎం చంద్రబాబును జైలుకు పంపితే.. ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ...

news

అంతా మాయిష్టం.. ఇదే మోడీ తీరు : ఏపీకే కేంద్రం కొర్రీలు

"అంతా నాయిష్ట ప్రకారమే జరగాలి. నేను చెప్పినట్టే చేయాలి. మనకు కలిసిరాని రాష్ట్రాల గురించి ...

news

ప్రేయసి కోసం సౌదీ రన్‌వే పై పరిగెత్తిన ప్రేమికుడు.. ఎందుకు?

ప్రియుడు షార్జాలో వున్నాడు. ప్రేయసి భారత్‌లో వుంది. అయితే ప్రేయసిని చూడలేకుండా ఆ ప్రియుడు ...

news

ఇక బీజేపీతో కష్టమే... ప్రత్యామ్నాయం చూసుకుందాం : ఎంపీలతో చంద్రబాబు

భారతీయ జనతా పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరితో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ...

Widgets Magazine