Widgets Magazine

స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కింద 6 నెలల్లో 20 లక్షల మరుగుదొడ్లు నిర్మాణం

బుధవారం, 11 అక్టోబరు 2017 (21:43 IST)

అమరావతి: రాష్ట్రంలో స్వఛ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఆరు మాసాల్లో 20 లక్షల మరుగుదొడ్లు నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కింద రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో యాంత్రిక విధానంలో రోడ్లు, డ్రైన్లు పరిశుభ్రం చేసేందుకు, గార్బేజి తరలింపునకు సమకూర్చిన వివిధ వాహనాలకు బుధవారం వెలగపూడి సచివాలయం రెండవ బ్లాకు వద్ద సియం జెండా ఊపి ప్రారంభించారు. 
chandrababu naidu
 
ఈ సందర్భంగా సియం మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా స్వఛ్ఛ ఆంధ్ర మిషన్ కింద రాష్ట్రాన్ని పరిశుభ్రమైన, సుందర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగానే ప్రత్యేకంగా ఎపి అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని సియం తెలిపారు. ఇందుకుగాను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉత్తమ విధానాలు(బెస్ట్ ప్రాక్టీసెస్)ను స్వీకరించి ఇక్కడ అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్టు సియం స్పష్టం చేశారు. 
 
ఈ ప్రక్రియలో భాగంగా వచ్చే ఆరు మాసాల్లో గ్రామాలు,పట్టణాల్లో 20 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే అన్ని గ్రామాలల్లో ఎల్ఇడి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోందని చెప్పారు. అన్ని పట్టణాల్లోను రోడ్లు, డ్రైన్లను ఎప్పటికప్పుడు సకాలంలో పరిశుభ్రం చేయడం ద్వారా రాష్ట్రాన్ని అన్ని విధాలా సుందర రాష్ట్రంగా చేసేందుకు పెద్దఎత్తున ఈయంత్రాలను సమకూర్చడం జరుగుతోందని సియం అన్నారు.
 
ఎపి అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా విశాఖపట్నం, విజయవాడ,తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లలో మూడు ట్రీ మెయిన్టెన్స్ ప్లాట్ ఫారం యంత్రాలను అందుబాటులో ఉంచడం జరుగుతోందని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ యంత్రాలు ఆయా నగరాల్లో వివిధ ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో నేలకూలినా లేదా ఎండిపోయి రోడ్లకు, విద్యుత్ లైన్లకు ఆటంకంగాను, వాహనాలు పాదచారులకు ఇబ్బందిగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి వాటిని అర్బన్ ల్యాండ్ స్కేపింగ్ విధానం కింద అందంగా తీర్చిదిద్దేందుకు వినియోగించడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేగాక ఆయా నరగాలను అందంగా,పరిశుభ్రంగా తీర్చిదిద్దేదుంకు ఇవి దోహదం చేస్తాయని సియం తెలిపారు.
 
రాష్ట్రంలోని అన్ని నగరాలు, మున్సిపాలిటీలిలో డ్రైన్లు, రోడ్లను యాంత్రిక విధానంలో క్లీన్ చేయడంతో పాటు వాటన్నిటినీ సుందరంగా తీర్చిదిద్దేదంకు వీలుగా వివిధ రకాల వాహనాలను సమకూర్చడం జరిగింది. వాటిలో ముఖ్యంగా గార్బేజి తరలించేందుకు ఒక్కొక్కటి 16 లక్షల రూపాయల వ్యయంతో 6 క్యూబిక్ మీటర్ల సామర్ధ్యంతో కూడిన 330 ట్రక్ మౌంటెడ్ రిప్యూజ్ కాంపాక్టర్లు,14క్యూబిక్ మీటర్ల సామర్ధ్యం కలిగిన ఒక్కొక్కటి 26 లక్షల 50 వేల రూపాయలు వ్యయం కలిగిన 140 ట్రక్ మౌంటెడ్ రిప్యూజ్ కాంపాక్టర్లు, ఒక్కక్కటి 14 లక్షల 30వేల రూపాయలు వ్యయం కలిగిన 255 స్కిడ్ స్టీర్ లోడర్లు, ఒక్కొక్కటి 26 లక్షల 66 వేల రూపాయల విలువ గల 150 కాంపాక్ట్ హెవీ డ్యూటీ రోడ్డు స్వీపింగ్ యంత్రాలు, ఒక్కొక్కటి 57 లక్షల 10 వేల రూపాయల వ్యయంతో కూడిన 15 ట్రక్ మౌంటెడ్ రోడ్డు స్వీపింగ్ యంత్రాలను వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సరఫరా చేసే కార్యక్రమం చేపట్టగా విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలకు అందించే వివిధ వాహనాలకు సియం జెండా ఊపి ప్రారంభించారు.
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి పి.నారాయణ, రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, మున్సిపల్ పరిపాలనాశాఖ సంచాలకులు కన్నబాబు, విజయవాడ మున్సిపల్ కమీషనర్ జె.నివాస్, స్వచ్ఛ ఆంధ్రా మిషన్ ఎండి మురళీధర్ రెడ్డి, స్వచ్ఛ ఆంధ్రమిషన్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సిఎల్.వెంకటరావు, గ్రీన్ బెల్టు కార్పొరేషన్ ఎండి చంద్రమోహన్ రెడ్డి, విజయవాడ నగర మేయర్ కె.శ్రీధర్, డిప్యూటీ మేయర్ జి.రమణ, ప్రజారోగ్యశాఖ ఇఎన్ సి చంద్రయ్య, సిఇ ఆనందరావు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

8 జాతీయ, అంతర్జాతీయ స్కూళ్లకు 32 ఎకరాలు... మంత్రి నారాయణ

అమరావతి : అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 జాతీయ, అంతర్జాతీయ పాఠశాలలకు రాష్ట్ర ...

news

తిరుపతి విమానాశ్రయంలో కలకలం.. ఎస్పీవై రెడ్డి బావమరిది ఏం చేశాడంటే...

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఎంపి ఎస్పీవై. రెడ్డి బావమరిది రామ్మోహన్ ...

news

5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం... మంత్రి సోమిరెడ్డి

అమరావతి : రాబోయే అయిదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నట్లు రాష్ట్ర ...

news

ఇంకోసారి పవన్ జోలికి వెళితే.. ఏం చేస్తానంటే... చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కోపం కట్టలు తెంచుకుంది. పవన్ కళ్యాణ్ విషయంలో కొందరు నాయకులు ...

Widgets Magazine