Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పేకాటలో జోకర్‌కు ఎంత విలువ ఉందో వర్మకేం తెలుసు : టీడీపీ ఎంపీ శివప్రసాద్

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (12:27 IST)

Widgets Magazine
sivaprasad

సినీ దర్శకుడు తమను జోకర్లతో పోల్చడంపై తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు డాక్టర్ శివప్రసాద్ స్పందించారు. దీనిపై ఆయన సోమవారం మాట్లాడుతూ, తనను జోకర్ అన్నా పెద్దగా బాధపడలేదని, పేకాటలో జోకర్‌కు ఎంత విలువ ఉందో తెలియదా? అని అడిగారు. పార్లమెంట్‌లో 28 రాష్ట్రాల సమస్యలు వస్తుంటాయని, వాటన్నింటినీ పక్కన బెట్టి, అందరి దృష్టినీ ఏపీ వైపు తిప్పాలంటే, కేవలం ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తే సరిపోదని అన్నారు. 
 
మీడియాను మాత్రమే కాకుండా, అందరి దృష్టినీ ఆకర్షించేందుకు విభిన్నంగా ప్రవర్తించాల్సిందేనన్నారు. సెక్రటరీ జనరల్ దగ్గర ఉన్న రూల్స్ బుక్స్ తీసుకుని తాను పరిగెత్తిన తర్వాతనే సభను వాయిదా వేశారని, తన ఉద్దేశం సభ జరుగనీయకుండా చూడటమేనని, అంతకన్నా తనకు మరో ఉద్దేశం లేదన్నారు. తానేమీ నేరం చేయలేదని అన్నారు. ఏ విధంగా వాయిదా వేయించాలన్నదే తన ఆలోచనని చెప్పుకొచ్చారు. తాము ఇంకా ఏమి చేస్తామోనన్న భయంతోనే కేంద్రం విభజన హామీల అమలుకు కదిలిందని అన్నారు.
 
తాము రాష్ట్రం కోసం ఎంతో చేస్తుంటే, వర్మ కామెంట్లు ఏంటని ప్రశ్నించిన శివప్రసాద్, ఆయనిచ్చిన బిరుదులపై బాధపడటం లేదని, ఎవరు ఏమనుకున్నా తాను ఆగనని చెప్పారు. పనిలేని వర్మలాంటి వాళ్లు చేసే కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇపుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. ఇకపై మోడీతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎలా నవ్వాలో నాకు తెలుసు.. నవ్వుకు జీఎస్టీ లేదు: రేణుకా చౌదరి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వు పట్ల చేసిన కామెంట్స్ కలకలం ...

news

రష్యాలో కూలిన విమానం.. 65 మంది మృత్యువాత

రష్యాలో విమానం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగు ప్రయాణ సిబ్బందితో పాటు మొత్తం 65 మంది ...

news

బొటానికల్ గార్డెన్ మర్డర్ మిస్టరీ వీడింది ... మరిదే హంతకుడు

హైదరాబాద్, బొటానికల్‌ గార్డెన్‌ దగ్గర మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. గర్భిణిని ...

news

కుటుంబాన్ని కాపాడి అమరుడైన సుబేదార్ మదన్‌లాల్

ఉగ్రవాదులు తనపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా వారికి ఎదురొడ్డి, తన కుటుంబ సభ్యులను ...

Widgets Magazine