Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మోడీగారు.. మీకు మూడిందా? : కోయదొర వేషంలో ఎంపీ శివప్రసాద్

శుక్రవారం, 9 మార్చి 2018 (13:15 IST)

Widgets Magazine
sivaprasad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదాను కేటాయించాలని కోరుతూ పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు గతవారం రోజులుగా వివిధ రకాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా, చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్. శివప్రసాద్ రోజుకో వేషంలో పార్లమెంట్‌కు వచ్చి తన నిరసనను తెలుపుతున్నారు.
 
ఇందులోభాగంగా, ఆయన శుక్రవారం కోయదొర వేషంలో పార్లమెంట్‌కు వచ్చారు. కొండదేవర తరహాలో మాట్లాడుతూ, పార్లమెంటులో కలియదిరిగారు. మధ్యలో, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ చేయి చూసి జాతకం కూడా చెప్పారు.
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 'బెజవాడ కనకదుర్గమ్మ మీద ఆన... తిరుపతి ఎంకన్న మీద ఆన.. జరిగింది చెబుతాను.. జరగబోయేది చెబుతాను.. ఆ నాడు ఇందిరకు చెప్పాను.. ఎన్టీఆర్‌తో పెట్టుకోవద్దని.. పెట్టుకుంటే ఏం జరిగిందో తెలుసు కదా.
 
ఈనాడు మోడీకి చెబుతున్నాను... ఏపీతో సఖ్యంగా ఉండటం ఇష్టం లేదా.. మీకు మూడిందా ఏంది... తెలుగు ప్రజల ఆత్మగౌరవ నాడి తెలియలేదా ఏంది.. ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు నీవు.. ఏపీని ఏం చేయాలనుకుంటున్నావు నీవు' అంటూ కోయదొర మాదిరి మాట్లాడారు. మా మాట వింటే హుర్రో హుర్రు.. లేకపోతే పుర్రో పుర్రు అంటూ వ్యాఖ్యానించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వెంకయ్యగారు... మీరూ రాజీనామా చేయండి : పెరుగుతున్న ఒత్తిడి.. దిక్కుతోచని బీజేపీ

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనక్కర్లేదంటూ ...

news

బీజేపీతో ఒరిగిందేమీ లేదు.. ఓట్లు అదనంగా పడలేదు: చంద్రబాబు

రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపీతో స్నేహాన్ని కొనసాగించామని ఏపీ సీఎం ...

news

కాంగ్రెస్ మోసం చేస్తే.. బీజేపీ నమ్మక ద్రోహం చేసింది : సుజనా చౌదరి

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తే.. తాము ...

news

ఆ కారణాలతో బాధపడేవారు లోకం విడిచి వెళ్లొచ్చు : సుప్రీంకోర్టు

కారుణ్య మరణాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక రూలింగ్ ఇచ్చింది. ఎప్పటికీ నయం కాని ...

Widgets Magazine