Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రబాబుకు ధైర్యముంటే జగన్‌తో పాటు నడవాలి: రోజా

శుక్రవారం, 10 నవంబరు 2017 (13:38 IST)

Widgets Magazine
rk roja

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హలూసినేషన్ సిక్స్ స్టేజ్‌లో వున్నారని.. ఆ స్టేజ్‌లో చేయనివన్నీ చేసినట్టుగా అలా అనిపిస్తుందని.. చంద్రబాబుకు ప్రస్తుతం అదే జబ్బు పట్టుకుందని నిప్పులు చెరిగారు. ఆ జబ్బు ప్రభావంతోనే రాష్ట్రంలో ఏ సమస్యా లేదని చంద్రబాబు చెప్తున్నారని, రుణమాఫీ చేశానని, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చానని చెప్పుకుంటున్నారన్నారు. 
 
రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకోవాలన్న ఆకాంక్షతో జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని.. ఈ యాత్రను చూసి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని రోజా విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ధైర్యముంటే జగన్‌తో పాటు నడిచి, ఏ గ్రామంలో ఏ అభివృద్ధి జరిగిందో చూపించాలని రోజా సవాల్ విసిరారు. 
 
ఎక్కడైనా రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం వచ్చిందా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. దోచుకున్నది దాచుకోవడమే తప్ప చంద్రబాబు మరేమైనా చేశారా? అంటూ ప్రశ్నించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

టీ సీఎం షర్మిల... రాష్ట్రపతి విజయమ్మ అంటారు : మంత్రి ఆదినారాయణ రెడ్డి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ...

news

ఛ... నా చదువుకి ఇంత తక్కవ జీతమా? ఉరి వేసుకున్న బీటెక్ విద్యార్థి

ఒకప్పుడు ఇంజినీరింగ్ చదువు అంటే డాలర్లకు డాలర్లు డబ్బు సంపాదన అనే పేరుండేది. అమెరికాలో ...

news

తెలంగాణాలో వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని ...

news

లంక సైన్యం దాష్టీకం.. పురుషులపై లైంగికదాడులు

శ్రీలంక సైన్యం బయటకు చెప్పుకోలేని అకృత్యాలకు పాల్పడుతోందట. ముఖ్యంగా, శ్రీలంక గడ్డపై ...

Widgets Magazine