శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (14:07 IST)

అనంతలో ప్రత్యేక హోదా ఉద్యమం : రోడ్డుపైనే విద్యార్థుల వంటా-వార్పు.. వైకాపా మద్దతు

ప్రత్యేక హోదా ఉద్యమం మళ్లీ ప్రారంభమైంది. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం నిధులింకా కేటాయించకపోవడం.. తాజాగా ప్రకటించబడిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర విభజనతో త

ప్రత్యేక హోదా ఉద్యమం మళ్లీ ప్రారంభమైంది. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం నిధులింకా కేటాయించకపోవడం.. తాజాగా ప్రకటించబడిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించకపోవడంతో తెలుగు ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
కేంద్ర బడ్జెట్‌లో విభజన చట్టం హామీలను విస్మరించిందని తెలుగు ప్రజలు బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా.. అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కేంద్రంగా ప్రత్యేక హోదా ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు రాజకీయ, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. విద్యార్థుల ప్రత్యేక హోదా ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీ వైకాపా కూడా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎస్‌కేయూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. 
 
గురు, శుక్రవారాల్లో ఆందోళన చేపట్టారు. శుక్రవారం అనంతపురం-కదిరి జాతీయ రహదారిపై విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అక్కడే వంటా-వార్పు చేసి సహపంక్తి భోజనం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడంతో పాటు విభజన చట్టం హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు గుంతకల్లును రైల్వే జోన్‌గా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, వైసీపీ నేతలు స్పష్టం చేశారు.