మామిడి చెక్క చూర్ణంతో ఒబిసిటీ పరార్..

సోమవారం, 9 జులై 2018 (11:17 IST)

లేదా మామిడి టెంకలోని పప్పు చూర్ణంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చిన్నపిల్లల కడుపులోకి నులిపురుగులను నశింపజేసే శక్తి మామిడి టెంక చూర్ణానికి వుంది.


అతి తక్కువ మోతాదులో మామిడి టెంకలోపలి పప్పుని పంచదార కలిపి పిల్లలకు పెట్టడం ద్వారా కడుపులోని నులిపురుగులు తొలగిపోతాయి. ఇంకా ఈ మామిడి టెంకలో విటమిన్ ఎ, ఇ, ఇంకా ఐరన్‌లు అధికంగా ఉంటాయి. మామిడి టెంక చూర్ణం ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
 
మామిడి టెంక చూర్ణంలోని యాంటీయాక్సిడెంట్లు బరువును తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మామిడిచూర్ణం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కంటిచూపును మెరుగుపరుస్తుంది. మామిడిపండులో విటమిన్ ఎ,సి,డి,బి6లు శరీరానికి హానికలిగించే విషతుల్యాలను తొలిగిస్తాయి.

హృద్రోగ సమస్యలు నివారించే ఆయుర్వేద ఔషధాల్లో మామిడి చూర్ణాన్ని వాడుతారు. ఇది గుండెకు మేలు చేస్తుంది. విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులను మామిడిచూర్ణం నివారిస్తుంది.
 
అలాగే మామిడి చెక్క, కరక్కాయతో కలిపి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఈ పొడి ఉదయం సాయంత్రం రోజూ రెండుపూటలా తీసుకుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది

మామిడి టెంకలోని జీడిని ఎక్కువ మోతాదులో ఒకేసారి నోట్లో వేసుకోకూడదు. తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం. చిన్నారులు వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటే మామిడి జీడిని కొద్ది మోతాదులో పంచదార కలిపి పెడితే తక్షణం ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మధుమేహానికి దివ్యౌషధం మునగాకు.. పాలకంటే 16 రెట్లు..?

మునగాకులో పాలకంటే 16 రెట్లు అధికంగా క్యాల్షియం వుంటుంది. అందుకే వారానికి రెండుసార్లు ...

news

ఈ చిట్కాలతో ఒత్తిడి మటుమాయం...

హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విద్య, ఉద్యోగం, ...

news

గంటకు 100 మైళ్ళ వేగంతో తుమ్ము... ఆపితే మరణమేనా?

చాలా మంది పిల్లలు లేదా పెద్దలు వచ్చే తుమ్మును బలవంతంగా ఆపుతుంటారు. నిజానికి తుమ్మితే ...

news

అరటి ఆకుల్లో భోజనం చేస్తే?

అరటి ఆకుల్లో భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి ఆకుల్లో సహజ సిద్ధమైన కార్బన్ ...