బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : శనివారం, 7 జులై 2018 (16:27 IST)

హోటల్స్‌లో దొరికే వెజ్ ఫ్రైడ్ రైస్ ఎందుకు? ఇంట్లోనే తయారుచేసుకుంటే?

జీర్ణసంబంధమైన సమస్యలతో, అల్సర్‌, కడుపునొప్పితో బాధపడేవారికి అన్నం ఆరోగ్యకరమైన ఆహారం. మధుమేహంతో బాధపడేవారికి అన్నం చాలా ఉపయోగపడుతుంది. అన్నంలో ఉండే మాంగనీస్ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అన్నంలో

జీర్ణసంబంధమైన సమస్యలతో, అల్సర్‌, కడుపునొప్పితో బాధపడేవారికి అన్నం ఆరోగ్యకరమైన ఆహారం. మధుమేహంతో బాధపడేవారికి అన్నం చాలా ఉపయోగపడుతుంది. అన్నంలో ఉండే మాంగనీస్ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అన్నంలో విటమిన్‌ బి పుష్కలంగా ఉంటుంది. ఇందులోని థయామైన్‌ ఆలోచనాశక్తిని పెంచుతుంది. మరి ఇటువంటి అన్నంతో ఫ్రైడ్ రైస్ ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్ - 3 కప్పులు
ఉల్లికాడ తరుగు - అరకప్పు
క్యాప్సికం - 1 
బీన్స్, క్యారెట్, క్యాబేజా తరుగు - 2 కప్పులు
వెనిగర్ - కాస్త
మిరియాలపొడి - తగినంత
ఉప్పు - సరిపడా
నూనె - 2 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందుగా నూనెలో ఉల్లికాడ తరుగును దోరగా వేగించి మిగిలిన కూరగాయలు తరుగు వేసి బాగా 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆ తరువాత అందులో ఉప్పు, మిరియాలపొడి వేసి కాసేపటి తరువాత అన్నె వేసి బాగ కలుపుకోవాలి. అంతే వెడ్ ఫైడ్ రైస్ రెడీ.