బాదం ఆకులతో.. చర్మ సమస్యలు మటాష్

వారానికోసారి రెండు స్పూన్ల బాదం నూనె ఉసిరిరసం తీసుకుని తలకు రాసుకుని మర్దన చేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు రాలడం, చుండ్రు జుట్టు రంగుమారే సమస్యలు పరిష్కారం అవుతాయి. బాదంలోని మెగ్నీషియం, బి6 విటమిన్‌-

Selvi| Last Updated: శనివారం, 14 జులై 2018 (12:25 IST)
వారానికోసారి రెండు స్పూన్ల బాదం నూనె ఉసిరిరసం తీసుకుని తలకు రాసుకుని మర్దన చేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు రాలడం, చుండ్రు జుట్టు రంగుమారే సమస్యలు పరిష్కారం అవుతాయి. బాదంలోని మెగ్నీషియం, బి6 విటమిన్‌- జీవక్రీయకు శక్తినందించి చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతాయి. బాదం రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచుతుంది. రక్తహీనతను పోగొడుతుంది. 
 
ఇంకా బాదం ఆకులు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. బాదం ఆకులను మెత్తగా నూరి.. చర్మ సమస్యలున్న ప్రాంతంలో పూతలా రాయడం ద్వారా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. మొటిమల నివారణకు కూడా బాదం బాగా పనిచేస్తుంది. 
 
బాదం మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాటియాసిడ్లు, విటమిన్‌ ఇ ఉంటాయి. ఈ రెండూ గుండెజబ్బుల బారి నుంచి కాపాడుతాయి. రోజూ కనీసం ఐదారు బాదం పప్పులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :