గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : సోమవారం, 25 డిశెంబరు 2017 (12:16 IST)

వెల్లుల్లిని పాలలో మరిగించి తీసుకుంటే ఆ.. ఇన్ఫెక్షన్లు మటాష్

వెల్లుల్లిని పాలలో మరిగించి తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చునని.. నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలున్నాయని. వెల్లుల్లి సహజసిద్ధమైన యాంటీ

వెల్లుల్లిని పాలలో మరిగించి తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చునని.. నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలున్నాయని. వెల్లుల్లి సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌‌గా కూడా పనిచేస్తుంది. ఇక రోజు తాగే పాలలో ఉడక పెట్టిన రెండు వెల్లుల్లి రెక్కలను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. 
 
చర్మ ఆరోగ్యం మెరుగుపడుతోంది. రక్తంలో వుండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తగ్గుతారు. చర్మంపై వుండే మచ్చలు, మొటిమలు దూరమవుతాయి. అంతేగాకుండా కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి. బాలింతలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. మైగ్రేన్ తలనొప్పిని దూరం చేస్తుంది. 
 
వెల్లుల్లి ఉడికించిన పాలను సేవిస్తే విటమిన్ ఎ, బీ1, బీ2, విటమిన్ బీ6, సీ, పొటాషియం, ప్రోటీన్, కాపర్, మాంగనీస్, ఫాస్పరస్, జింక్, సెలీనియమ్, క్యాల్షియం పుష్కలం లభించినట్లే. ఈ పానీయాన్ని రోజు గ్లాసుడు తీసుకుంటే.. మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. సెక్స్ ద్వారా ఏర్పడే ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా, జలుబును నయం చేసుకోవచ్చు. హృద్రోగ వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.