శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : గురువారం, 15 మార్చి 2018 (11:11 IST)

నల్లేరు పచ్చడిని రోజూ పదిగ్రాములు తీసుకుంటే..?

నల్లేరు పచ్చడిని రోజూ పది గ్రాముల మోతాదులో తీసుకుంటే.. ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. నల్లేరు కాడను తీసుకుని కణుపులు తొలగించి.. మిగిలిన కాడలను ముక్కలుగా కత్తిరి

నల్లేరు పచ్చడిని రోజూ పది గ్రాముల మోతాదులో తీసుకుంటే.. ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. నల్లేరు కాడను తీసుకుని కణుపులు తొలగించి.. మిగిలిన కాడలను ముక్కలుగా కత్తిరించి.. బాణలిలో ఒక స్పూన్ నూనె పోసి.. ఒక స్పూన్ మినుములు, ఒక స్పూన్ శెనగపప్పు, నాలుగు ఎండు మిరపకాయలను వేసి దోరగా వేపుకోవాలి. ఆపై నల్లేరు కాడల ముక్కలను చేర్చి దోరగా వేపుకుని తగినంత ఉప్పు చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ఆరబెట్టి మిక్సీలో రుబ్బుకుని పోపు పెట్టుకుని సీసాలో భద్రపరుచుకోవాలి. 
 
ఈ పచ్చడి రోజూ అన్నంలోకి పది గ్రాముల మేర తీసుకుంటే మోకాళ్ల నొప్పులు దూరమవుతాయి. ఇంకా ఎముకలకు బలాన్నిస్తాయి. అలాగే నాలుగు అంగుళాల పొడవు గల నల్లేరు కాడను ఒక తులం వెన్నలో కలిపి ముద్దగా నూరి, రోజుకు ఒకసారి తినాలి. ఆ తర్వాత 3 గంటల దాకా ఏరకమైన ఆహారమూ తీసుకోకూడదు. 
 
ఇలా ఏడు రోజుల పాటు తీసుకుంటే.. విరిగిన ఎముకలు త్వరగా అతుకుతాయి. అలాగే నల్లేరు కాడల చూర్ణాన్ని ఒక స్పూను మోతాదులో తీసుకుంటే పైల్స్‌ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి. కాడలను నీటితో ముద్దగా నూరి, అరతులం మోతాదులో పాలతో ప్రతి రోజూ రెండు పూటలా తీసుకుంటే, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.