Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వీర్యకణాల వృద్ధికి లవంగాలు..

గురువారం, 12 అక్టోబరు 2017 (10:02 IST)

Widgets Magazine

తేనె, కొన్ని చుక్కల లవంగం నూనెను గోరువెచ్చటి నీటిలో కలిపి రోజులో మూడుసార్లు తాగితే జలుబు తగ్గిపోతుంది. లవంగాలను పొడి చేసి, నీళ్ళలో తడిపి ఈ ముద్దను వాసనచూస్తుంటే సైనస్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం ద్వారా ఒత్తిడి, అలసట, ఆయాసం తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలను నివారించడంలో లవంగం చక్కగా పనిచేస్తుంది. 
 
లవంగాలలో ఉండే యూజెనాల్‌ అనే రసాయన పదార్థం నోటిలోని బ్యాక్టీరియాను కూడా నివారిస్తుంది. లవంగాలు వీర్య కణాల వృద్ధికి కూడా తోడ్పాటునందిస్తాయి. తులసి, పుదీనా, లవంగాలు, యాలకల మిశ్రమంతో టీ చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఈ టీలో చక్కెరకు బదులు తేనెను ఉపయోగించడం ఉత్తమమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
ఆస్తమా, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులను నివారించడంలో కూడా యాలకులు, లవంగాలు బాగా పనిచేస్తాయి. రెండుమూడు యాలకులు, లవంగాలు, ఓ అల్లం ముక్కను కాసిన్న దనియాలతో కలిపి పోడి చేసి పెట్టుకోవాలి. రోజూ గ్లాస్ వేడినీటిలో వేసుకుని తాగితే అజీర్ణ సమస్య దూరమవుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గుండెజబ్బుతో బాధపడేవారు.. రోజూ జామపండును తీసుకుంటే?

గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతిరోజూ భోజనంతో పాటు జామపండును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ...

news

శొంఠి ఇంట్లో వుంటే.. ఎంతో మేలు

వర్షాకాలం శొంఠి ఇంట్లో వుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో తరచూ తడవడం వల్ల ...

news

మునగాకు రసాన్ని నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాసుకుంటే..?

మునగాకు రసాన్ని, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి ప్రతి రోజూ ఉదయం రాసుకుంటే మొటిమలను దూరం ...

news

చికెన్, కోడిగుడ్డును ఫ్రిజ్‌లో పెట్టి హీట్ చేసుకుని తింటున్నారా?

ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసుకుని తీసుకునే ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ...

Widgets Magazine