హనీప్రీత్ సింగ్ చెప్పును కూడా వదల్లేదు.. ఫోటో తీసిన మీడియా.. సెల్ఫీల కోసం..

బుధవారం, 11 అక్టోబరు 2017 (13:13 IST)

డేరా బాబా సన్నిహితురాలు, దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల రిమాండులో విచారణను ఎదుర్కొంటున్న హనీప్రీత్‌ను కోర్టుకు తీసుకొచ్చిన వేళ ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రిమాండ్ పూర్తికావడంతో ఆమెకు కోర్టుకు తెచ్చిన పోలీసులు.. హనీప్రీత్ విచారణకు ఎంతమాత్రమూ సహకరించలేదన్నారు. 
 
వాదోపవాదాలు పూర్తయిన తర్వాత హనీప్రీత్ సింగ్‌ను పోలీసులు బయటకు తీసుకొచ్చారు. అక్కడే హనీ కోసం ఎదురుచూస్తున్న మీడియా ఒక్కసారిగా ఆమెతో మాట్లాడేందుకు ముందుకెళ్లింది. దీంతో హనీప్రీత్‌ను వేగంగా పోలీస్ వ్యానులోకి తీసుకెళ్లారు. 
 
ఆమె వ్యాన్ అలా ఎక్కగానే.. కింద ఓ తెగిపడిన మహిళ చెప్పు కనిపించింది. అది హనీప్రీత్‌దో కాదో.. అందరూ దాన్ని హనీప్రీత్‌ చెప్పుగానే భావించారు. మీడియా ఫోటోగ్రాఫర్లు ఆ చెప్పు ఫోటోలు తీసుకేందుకు ఎగబాకారు. ఎంతోమంది సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు. కాగా, కోర్టుకు వచ్చిన హనీప్రీత్ తనకు నడుం నొప్పిగా ఉందని, నిలుచోలేకపోతున్నానని, చేతులు జోడించి పోలీసులను వేడుకుందని జాతీయ మీడియా వెల్లడించింది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గుండెలు పిండేసే ఘటన... కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ కూడా....

భారత ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో తీవ్రవాదులతో నిత్యం పోరాడుతూ దేశాన్ని, దేశ ప్రజలను ...

news

పూనకం పట్టినట్టు ఊగిపోయిన విమానం.. ఎందుకు (Video)

సాధారణంగా విమానాలు రన్‌వేపై ల్యాండ్ అయ్యే సమయంలో కాస్తంత భయభ్రాంతులకు గురిచేస్తాయి. అదే ...

news

భారత్‌పై అణు బాంబులతో దాడికి సిద్ధమవుతున్న పాకిస్థాన్?

భారత్‌పై అణు బాంబులతో దాడి చేసేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. వివిధ అంశాలపై ...

news

జై షా ఆస్తులపై విచారణ జరిపించాలి : ఏచూరి డిమాండ్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జై షా కంపెనీ పెరుగుదల, ఆయన ఆస్తులపై విచారణ ...