డేరా బాబా నా భర్త కాదు.. నాకు తండ్రిలాంటివారు : హనీప్రీత్

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (12:15 IST)

honeypreet

డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తనకు భర్త కాదనీ, తనకు తండ్రిలాంటివారని డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పేర్కొంది. అత్యాచారం కేసులో డేరా బాబాకు జైలుశిక్ష పడిన తర్వాత హనీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా ఆమె కోసం హర్యానా పోలీసులు గాలిస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ కనుగొనలేక పోయారు. ఈ నేపథ్యంలో హనీప్రీత్ కోసం హర్యానా పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. 
 
ఈ నేపథ్యంలో... హనీప్రీత్ ఢిల్లీలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ముందస్తు బెయిల్ దరఖాస్తుపై సంతకం చేసేందుకు సోమవారం హనీప్రీత్ సింగ్ తన కార్యాలయానికి వచ్చినట్టు ఆమె తరపు న్యాయవాది ప్రదీప్ ఆర్య వెల్లడించారు. ఈ ముందస్తు బెయిల్ పిటీషన్‌లో డేరా బాబాతో తనకు వివాహేతర సంబంధం లేదనీ, ఆయన తనకు తండ్రిలాంటివాడనీ హనీప్రీత్ పేర్కొంది. పైగా, డేరా బాబా ఎలాంటి తప్పు చేయలేదనీ, ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని హనీప్రీత్ హామీ ఇచ్చింది. 
 
'డేరాబాబాను దోషిగా నిర్ధారించడం.. తనకు, గుర్మీత్‌కు మధ్య అక్రమ సంబంధాలున్నట్టు ప్రచారం చేయడంపై హనీప్రీత్ సింగ్ తీవ్ర కలతకు గురయ్యారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా కోర్టును కోరనున్నాం. ప్రాథమికంగా ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు. ఆమెపై అలాంటి అభియోగాలు మోపడం సరైంది కాదు...' అని ఆమె న్యాయవాది ప్రదీప్ ఆర్య వెల్లడించారు. దీనిపై మరింత చదవండి :  
Honeypreet Insan Anticipatory Bail Dera Baba Delhi High Court

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రత్యేక పూజల పేరుతో వివాహితపై పూజారి అత్యాచారయత్నం

వ్యాపారంలో వచ్చిన నష్టాలను అధికమించి తిరిగి లాభాలను గడించాలంటే ప్రత్యేక పూజలు చేయాలని ...

news

నేపాల్‌లో హనీప్రీత్ సింగ్: ముందస్తు బెయిల్ కోసం పిటిషన్... హర్యానా పోలీసులు గాలింపు..

డేరాబాబా కేసులో కీలక నిందితురాలు హనీప్రీత్ నేపాల్‌లో లేదని తేలిపోయింది. అంతేగాకుండా ...

news

రఘు ఇంట్లో తవ్వే కొద్దీ ఆస్తులు.. రూ.500 కోట్ల అక్రమ సంపాదన?

ఏపీ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ గొల్ల వెంకట రఘు అవినీతితో సంపాదించిన ఆస్తులు అందర్నీ ...

news

'అమ్మ’ క్యాంటీన్లలో ధరల పెంపు... మౌనందాల్చిన ఓపీఎస్

నిరుపేదల కడుపు నింపేందుకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఏర్పాటు చేసిన ‘అమ్మ క్యాంటీన్ల'లో ...