చర్మవ్యాధులకు పసుపు దివ్యౌషధం? ఎలా?

మంగళవారం, 15 మే 2018 (15:29 IST)

పసుపు సహజ యాంటీబ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. గాయాలను మాన్పించడంలో పసుపు ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. పసుపు నశించిన చర్మపు కణాలను మళ్లీ సక్రియం చేస్తాయి. వాపు సంబంధిత చర్మపు సమస్యలను నయం చేయడానికి పసుపును వినియోగిస్తారు. ఆంధ్రుల సంస్కృతిలో, ఆచార వ్యవహారాల్లో పసుపుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. 
 
పసుపు మంగళకరమైనది. మనం రోజువారి ఆహారంలో పసుపు ఒక భాగంగా తీసుకుంటాం. శుభకార్యాల్లో పసుపును కాళ్ళకు, ముఖానికి రాసుకోవడం మంగళప్రదంగా భావిస్తారు. ఇది రక్తశుద్ధికి, క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. పసుపులో ప్రోటీన్, ఆహార సంబంధిత పీచు, విటమన్ ఇ, విటమన్ సి, పొటాషియం, రాగి, ఇనుము, కాల్షియం, మెగ్నిషియం, జింక్ వంటి పలు ఆరోగ్యవంతమైన పోషకాలు కూడా లభిస్తాయి.
 
ఉపయోగాలు:
పసుపు, చందనం రెండింటిని పాలమీది మీగడతో కలిపి స్నానానికి అరగంట ముందుగా ముఖానికి రాసుకుని కాసేపు తరువాత చన్నీళ్ళలో శుభ్రంగా కడిగితే ముఖం వర్చస్సు పెరుగుతుంది. శరీరకాంతి ఇనుమడిస్తుంది.
 
పసుపు, ఉసిరిక చూర్ణాన్ని సమపాలల్లో 2 గ్రాముల చొప్పున రోజు ఉదయం - సాయంత్రం త్రాగడం వలన మధుమేహం నుంచి ఉపశమనం పొందవచ్చును. దాదాపు 10 గ్రాముల పచ్చి పసుపు 20-40 గ్రాముల ఆవు పెరుగులో కలిపి ఉదయం తీసుకున్న యెడల కామెర్లు తగ్గుటకు ఉపయోగపడుతుంది. పసుపు, వేపచెక్క పట్టచూర్ణం, కరకాయ చూర్ణాలను సమభాగాలుగా తీసుకుని 2 గ్రాముల చొప్పున వాడితే చర్మవ్యాధులు, క్రిమిరోగాలు నయమవుతాయి.
 
పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్ళు, దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకుని దీర్ఘకాలంగా ఉన్న వ్రణాలను శుభ్రంగా కడిగి పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గడం జరుగుతుంది. పసుపు, తులసి ఆకులరసం కలిపి పట్టువేస్తే దీర్ఘకాలిక సమస్యలు మానిపోతాయి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వేసవిలో అందానికి ఆరోగ్యానికి "మల్లెపూలు" వైద్యం...

వేసవిలో సాయంకాలాల్లో ఇంటికి సువాసనలిచ్చే మల్లెపూల గురించి, మహిళల జడల్లో తళ తళ మెరిసి పోయే ...

news

తులసి ఆకుల టీతో ముఖాన్ని కడిగితే..

వాతావరణ కాలుష్యాల వలన చర్మం ప్రకాశవంత రహితంగా ముఖ ఛాయను జీవ రహితంగా మార్చుతుంది. ఈ ...

news

బెండకాయలను తినడం వల్ల జరిగే మేలు ఏమిటో తెలుసా?

బెండకాయలు మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది. 100 గ్రాముల బెండకాయ ముక్కల్లో 2.5 గ్రాముల పీచు, ...

news

వేసవిలో ఎన్ని లీటర్ల నీరు త్రాగాలో తెలుసా?

శరీరంపైన మలినాలను తొలగించేది జల స్నానం అయితే, శరీరం లోపలి మలినాలను కడిగి జీవక్రియలకు ...