Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఘుమఘుమలాడే ఆలూ చికెన్ బిర్యానీ తయారీ ఎలా?

మంగళవారం, 15 మే 2018 (14:41 IST)

Widgets Magazine

చర్మ ఆరోగ్యానికి విటమిన్ సి, బి కాంప్లెక్స్, పొటాషియం, మెగ్నిషియం, వంటి మినరల్స్ బంగాళాదుంపలు.. ప్రోటీన్లు వున్న చికెన్ కాంబినేషన్‌లో ఆలూ చికెన్ బిర్యానీ ట్రై చేయండి. కడుపులో మంటని తగ్గించేందుకు ఆలూ బాగా పనిచేస్తుంది. ఈ ఆలూ తినడం వల్ల జీర్ణ క్రియ వ్యవస్థలు మృదువుగా, తేలికగా పనిచేస్తాయి. విటమిన్ 6లు ఇందులో అధికంగా ఉండడం వల్ల ప్రేగులలో మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది. 
biriyani receipe" width="600" />
 
కావలసిన పదార్థాలు: 
చికెన్ - ఒక కప్పు
ఉడికించిన అన్నం - అరకప్పు
ఉడికించిన ఆలు -  ఒక కప్పు 
దాల్చిన చెక్క - చిన్న చిన్న ముక్కలు
యాలకులు - 4 లేదా 5 
మిరియాలు - సరిపడా
బిర్యానీ ఆకులు - కొద్దిగా 
పచ్చిమిర్చి - 8
ఉల్లిపాయ ముక్కలు - 2 కప్పులు
కారం - సరిపడ
నిమ్మరసం - ఒక స్పూన్
కొత్తిమీర ఆకులు - 1 కప్పు
కుంకుమపువ్వు - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడ
నూనె - తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని సగం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఓ పెద్ద గిన్నెలో చికెన్ ముక్కలు, కారం, ఉప్పు, నిమ్మరసం, చిటికెడు పసుపువేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి వేడయ్యాక ముక్కలను కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో పచ్చిమిరపకాయలు, దాల్చినచెక్క, యాలకులు, మిరయాలు, బిర్యానీ ఆకులు వేసి దోరగా వేయించుకోవాలి.
 
ఆ తరువాత ఆ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు జతచేర్చి మరికొద్దిసేపు వేయించి అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలపాలి. అన్నీ వేగిన తరువాత చికెన్ ముక్కలు వేసి మరికొద్ది సేపు వేయించి చివరగా బంగాళాదుంప ముక్కలు కలిపి అందులో ఉడికిన అన్నాన్ని రెండు భాగాలుగా చేసుకుని ఒక భాగం మీద వేయించి పెట్టుకున్న మిశ్రమంలో సగభాగాన్ని తీసుకుని లేయర్‌గా పరుచుకోవాలి. 
 
దానిపైన మిగిలిన అన్నం వేసి మిగతా కూరను కూడా పోసి కుక్కర్‌లో ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేవరకు ఉంచి దింపుకోవాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుంటే ఆలూ బిర్యానీ రెడి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ఆరోగ్యం వంటకాలు బంగాళాదుంప బిర్యానీ Chiken Cooking Special Health Benefits Potato Biriyani

Loading comments ...

వంటకాలు

news

అబ్బ... ఆలూ టిక్కీ ఎంతో రుచి... టేస్టీగా ఎలా చేయాలంటే?

బంగాళదుంపలో విటమిన్-సి, విటమిన్- బి6, పొటాషియం పుష్కలంగా ఉండమే కాదు, కొద్ది మెత్తంలో ...

news

మధుమేహాన్ని, కొలెస్ట్రాల్‌ను తగ్గించే రాగుల ఇడ్లీలు ఎలా చేయాలి?

రాగులు మధుమేహ వ్యాధికి ఎంతో మేలు చేస్తాయి. రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, ...

news

వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే సోంపు షర్బత్ మీ కోసం..

సోంపు నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. అజీర్తికి చెక్ పెడుతుంది. సోంపు నూనెతో మర్దనచేస్తే ...

news

క్యారెట్ హల్వా ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి? (VIDEO)

క్యారెట్ హల్వాలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో వున్నాయి. క్యారెట్ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ...

Widgets Magazine