శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2017 (13:13 IST)

తెలుపు మందారంతో నెలసరి సమస్యలుండవ్.. మందార ఆకుల పచ్చడి తింటే?

తెలుపు మందార పువ్వులు కంటి దృష్టి లోపాలను దూరం చేస్తాయి. మందారంలో తెలుపు రంగు గల పువ్వులు కంటి సమస్యలతో పాటు కీళ్ళ నొప్పులను నయం చేస్తాయి. అంతేకాదండోయ్ బరువును కూడా తగ్గిస్తుందని, నెలసరి సమస్యలను కూడా

తెలుపు మందార పువ్వులు కంటి దృష్టి లోపాలను దూరం చేస్తాయి. మందారంలో తెలుపు రంగు గల పువ్వులు కంటి సమస్యలతో పాటు కీళ్ళ నొప్పులను నయం చేస్తాయి. అంతేకాదండోయ్ బరువును కూడా తగ్గిస్తుందని, నెలసరి సమస్యలను కూడా తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. తెలుపు మందారం శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. మోకాళ్ల నొప్పికి చెక్ పెడుతుంది. రక్తస్రావాన్ని నియంత్రిస్తుంది. జలుబు, దగ్గుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.  
 
తెలుపు మందార పువ్వులతో నెలసరి సమస్యలను తొలగించుకునే టీ తయారు చేయవచ్చు. ఎలాగంటే.. ఓ పాత్రలో ఐదు తెలుపు మందార పువ్వులను తీసుకుని అందులో ఓ గ్లాసుడు నీరు చేర్చాలి. అందులో బెల్లం చేర్చుకోవాలి. మరిగాక వడగట్టి తాగితే నెలసరి సమస్యలుండవ్. నెలసరిలో అధిక రక్తస్రావాన్ని కూడా ఈ టీ నియంత్రిస్తుంది. జలుబు, దగ్గుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మోకాలి నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే.. మందార ఆకుల రసాన్ని వారానికోసారి తాగితే మంచి ఫలితం వుంటుంది. అలాకాకుండా మందార ఆకులతో పచ్చడి చేసుకుని తిన్నా ఉపశమనం వుంటుంది. ఇంకా బరువును తగ్గిస్తుంది. 
 
ఇక 250 గ్రాముల తెలుపు మందార రేకులను ఓ పాత్రలోకి తీసుకుని అందులో 200 గ్రాముల ఆముదం చేర్చి.. తైలంలా మరిగించాలి. ఆపై దించేసి వడగట్టి సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని కంటికి కాటుకలా రాసుకున్న లేకుంటే తలకు రాసుకుని పావు గంట తర్వాత స్నానం చేసినా కంటికి చలవ చేస్తుంది. దృష్టి లోపాలుండవు.