శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : శనివారం, 11 అక్టోబరు 2014 (17:54 IST)

ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన 4 బెస్ట్ ఫుడ్స్!

గర్భధారణ, ప్రసవం తర్వాత తల్లి కోల్పోయిన ఎనర్జీ పొందడానికి కార్బో హైడ్రేట్స్ చాలా అవసరం. కోల్పోయిన ఎనర్జీ తిరిగి పొందడానికి తగినంత కార్బో హైడ్రేట్స్ తిరిగి శరీరం గ్రహించబడాలంటే బ్రైన్ రైస్ లేదా బార్లీను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్‌లో ఫాస్టా కూడా ఒకటి. హై క్యాలరీలను కలిగివుండే ఫాస్టాను తీసుకోవడం ద్వారా అధిక ఎనర్జీ లభిస్తుంది. 
 
ప్రసవం తర్వాత తీసుకోవల్సిన ఆహారాల్లో మరొక హెల్తీ ఫుడ్ చీజ్. ఈ డైరీ ప్రొడక్ట్ హై క్యాలరీస్‌ను కలిగి ఉంటుంది, కాబట్టి పాలిచ్చే తల్లులకు చాలా ఆరోగ్యకరమైన ఆహారమని గైనకాలజిస్టులు చెబుతున్నారు. 
 
ఇంకా డెలీవరీ తర్వాత తీసుకోవాల్సిన డైట్‌లో సిట్రస్ పండ్లు ఉండాలి. ప్రసవం తర్వాత నిరభ్యరంతంగా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి. కానీ అవి మితంగా తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా ఆరెంజ్, పైనాపిల్, గ్రేప్స్, మరికొన్ని ఇతర సిట్రస్ పండ్లును తీసుకోవచ్చు. వీటని కూడా మితంగా తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.