శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 25 మే 2015 (18:16 IST)

డ్రై ఫ్రూట్స్, నట్స్‌తో ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్‌ తీసుకుంటే?

డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఆరోగ్యానికి గ్రేట్‌గా సహాయపడుతాయి. ఎందుకంటే వీటిలో న్యూట్రీషియన్స్, విటమిన్స్ అత్యధికంగా ఉండటం వల్ల ఇవి మన శరీరంకు అవసరం అయ్యే అనే విటమిన్స్, న్యూట్రీషియన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి అనేక రకాల జబ్బులను నివారిస్తాయి. వ్యాధినిరోధకతకు ఎలాంటి హాని జరగకుండా నివారించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
 
డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉండటం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నట్స్‌లో ఐరన్, ప్రోటీన్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్‌ను ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్‌తో లేదా లెమన్ వాటర్‌తో తీసుకుంటే ఐరన్ మరింత బెటర్‌గా శరీరంలోకి షోషింపబడుతుంది. ఎందుకంటే ఈ రెండు సిట్రస్స్ ఫ్రూట్స్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల అది సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.