శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. »
  3. మహిళ
  4. »
  5. ఆహారం
Written By Selvi
Last Updated : బుధవారం, 28 మే 2014 (18:09 IST)

బిడ్డకోసం తల్లికి పౌష్టిక ఆహారం తీసుకోవడం చాలా అవసరం

మహిళ జీవితంలో అమ్మ అనే పదానికున్నంత విలువ మరే పదానికీ లేదు. బిడ్డకోసం తల్లి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ సలహాలిస్తుంటారు. చివరకు నీళ్ళెన్నిమార్లు తాగాలో కూడా చెబుతారు. 
 
సాధారణంగా తల్లి నుంచి బిడ్డ శారీరకంగా వేరు పడేంతవరకు కడుపులోని బిడ్డ తల్లి ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తల్లి తీసుకునే ఆహారానికి చాలా విలువ ఉంటుంది. కాబట్టి తల్లి వీలైనంత వరకూ పౌష్టిక ఆహారం తీసుకోవడం ఉత్తమం. ప్రొటీన్లు,ఖనిజాలు విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకూ మధుర ఆహారాన్నే తీసుకోవాలి. 
 
అలాగని నేరుగా అధికంగా తీపి పదార్థాలను తినడం ఎంతమాత్రం కాదు. మధురం అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి. ప్రకృతి సిద్ధంగా ఉన్న మధర ఫలాలను తినాలి. అయితే ఏ పదార్థం కూడా అధికంగా తీసుకోరాదు. 
 
తేలికగా జీర్ణమయ్యే పదార్థాలనే తీసుకోవడం మంచిది. ఆహారం అధిక మోతాదులో తీసుకోవడం కంటే, తక్కువ పరిమాణంలో ఎక్కువ మార్లు తింటే చాలా మంచిది. తేలికగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. 
 
ఆహారం తీసుకోవడంలో చాలా వేళలను పాటించడం ముఖ్యం. ఉదయం లేవగానే నోరు శుభ్రం చేసుకుని ఒక గ్లాసు పాలు తాగాలి. 8-8.30ల మధ్యలో తేలికపాటి అల్పహారం తినడం మంచిది. ఇందులో ఇడ్లి, పెసరట్టు, దోశ వంటివే ఉత్తమం. అలాకాకుండా పూరి, చపాతీ వంటివి భుజించడం వలన జీర్ణ సమస్య ఏర్పడుతుంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో భోజనం చేయాలి. ఇందులో ఆకు కూరలు, పప్పులు ఉండాలి. 
 
మాంసాహారమైతే కొద్దిగా తీసుకోవడం మంచిది. మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పాలు తాగాలి. తాజా పళ్ళు, పళ్ళ రసాలు మంచిది. అయితే ఇక్కడ హాని చేసే పండ్లను వాడరాదు. అనాస, బొప్పాయిలను తీసుకోరాదు. బిడ్డ తెలివితేటలు పెరగాలంటే మొదటి నాలుగు నెలల వరకూ నెయ్యి అధికంగా వాడడమే మంచిదని కొందరు ఆయుర్వేద డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఇది కూడా ఇంటిలో మీగడ నుంచి తీసిన నెయ్యి అయితేనే మంచిదన్నది వారి సూచన. ఇలా గర్భవతిగా ఉన్నంతకాలం ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే పుట్టబోయే బిడ్డకు చాలా మేలు జరుగుతుంది.