శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (17:52 IST)

ఊబకాయం ఉన్న మహిళలు అల్పాహారంలో..?

సులువుగా బరువు తగ్గాలనుకుంటే వ్యాయామం ఒక్కటే కాకుండా ఆహారంలోనూ కొద్ది మార్పులు అవసరం. ముఖ్యంగా కోడిగుడ్డును అల్పాహారంలో చేర్చుకోవాలి. వీటిలోని మాంసకృత్తులు సులువుగా పొట్టనిండినట్లు చేస్తాయి. దాంతో ఎక్కువ సేపు ఆకలి వేయదు. 
 
ఊబకాయం ఉన్న మహిళలు పొద్దున అల్పాహారంలో గుడ్లూ, బ్రెడ్లు సైసుల్ని తీసుకోవడం వల్ల కెలోరీలు తగ్గుతాయి. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. రక్తంలో చక్కెర స్థాయులూ పెరగకుండా ఉంటాయి. చికెన్‌ను కూడా వారానికి రెండు సార్లు తీసుకోవడం మంచిదే. 
 
అలాగే గ్రీన్ టీ తీసుకోవాలి. ఇందులోని ప్రత్యేక యాంటీఆక్సిడెంట్లు జీవప్రక్రియ వేగాన్ని పెంచి, కొవ్వును కరిగిస్తాయి. కాఫీ, టీ మానేసి బదులుగా గ్రీన్ టీని తరచుగా తీసుకునే వారిలో చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.