శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2014 (18:30 IST)

మహిళలూ.. బొజ్జను కరిగించాలంటే.. 3 టిప్స్ పాటించండి.!

బొజ్జను కరిగించాలా.. అయితే ఈ 3 టిప్స్ పాటించండి. బెల్లీ క్రొవ్వును కరిగించుకోవడానికి అత్యధికంగా కష్టపడి చేసే వ్యాయామాలు, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవల్సిన అవసరం లేదు. పొట్టకు సరిపోయే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. 
 
ముఖ్యంగా ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలను సాయంత్రం 3-4 గంటలలో లోపు తీసుకోవాలి. ఈ సమయంలో ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని షుగర్ లెవల్స్  శాతంను నియంత్రించడానికి సహాయపడుతుంది. దేహంలో చక్కెర శాతం సమతుల్యంగా ఉంచుకోవడం వల్ల శరీరం ఎల్లప్పుడు ఫిట్‌గా ఉంటుంది. ఇష్ట వచ్చినట్లు, వేలా పాలా లేని టైమ్‌లో తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
 
అలాగే బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఆకు కూరలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా మహిళల డైయట్ లిస్ట్‌లో గ్రీన్ లీఫ్స్‌కు, గ్రీన్ వెజిటేబుల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. 
 
ఓట్స్ తీసుకోవడం మర్చిపోకూడదు. ఓట్స్‌లో ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్నాయి.  ఎక్కువ సేపు కడుపులో నిల్వ వుంటుంది. దీనివల్ల ఎక్కువగా ఆకలి ఉండదు. ఓట్స్‌తో పాటు చక్కెరను కాకుండా ప్రకృతి సిద్ధమైన తేనెను ఉపయోగించడం ఎంతో మంచిది.

ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశె, పూరీ, చపాతీలాటి వాటికన్నా ఓట్స్‌ను తీసుకుంటే మంచిది. ఇది గుండె జబ్బులతో సమర్థవంతంగా పోరాడడమే కాకుండా, అధికబరువును తగ్గిస్తుంది. దీనిలో ఫ్యాటీ ఫైబర్ జీర్ణప్రక్రియను ఎక్కువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.