గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (17:47 IST)

ఎఫ్‌డీలపై 8.50 శాతం వరకు వడ్డీ ఆఫర్ : బంధన్ బ్యాంకు

rajinder babbar
బంధన్ బ్యాంక్ ఆకర్షణీయమైన 8.50 శాతం వడ్డీ రేటుతో కొత్తగా ఒక యేడాది 9 నెలల కాలవ్యవధి ఫిక్సిడ్ డిపాజిట్ బకెట్‌ను ప్రకటించింది. ఒక ఏడాది 9 నెలల కాలవ్యవధికి ఫిక్సిడ్ డిపాజిట్ చేసే సీనియర్ సిటిజన్లకు బ్యాంకు 8.5 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇదే ఎఫ్‌డీ కాలవ్యవధిపై ఇతర కస్టమర్లు 8 శాతం వడ్డీ రేటు పొందవచ్చు. అలాగే రూ.10 లక్షల పైగా బ్యాలెన్స్ గల పొదుపు ఖాతాలపై బంధన్ బ్యాంకు 7 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. 
 
'మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, కస్టమర్లపట్ల మాకున్న నిబద్ధతకు నిదర్శనంగా కొత్త ఫిక్సిడ్ డిపాజిట్ బకెట్‌ను ప్రవేశపెట్టామని తెలియజేయడానికి బంధన్ బ్యాంకు సంతోషిస్తోంది. మెరుగైన రాబడులు అందించేందుకు ఉద్దేశించిన మా ‘లయబిలిటీ-ఫస్ట్’ వ్యూహాన్ని ఈ వినూత్న విధానం ప్రతిఫలిస్తుంది. మా ఆర్థిక బాధ్యతలు మరియు కస్టమర్ల అవసరాలను లోతుగా అర్థం చేసుకున్న మీదట వాటికి అనుగుణంగా డిపాజిట్ పథకాలను ఆఫర్ చేయడం ద్వారా ఇటు పోటీ సంస్థలతో పోలిస్తే మెరుగైన రేట్లు, అటు అసాధారణ సర్వీసును అందించాలని మేము నిర్దేశించుకున్నాం. మా డిపాజిట్ పథకాలు మా విలువైన క్లయింట్ల అంచనాలను అందుకోవడమే కాకుండా వాటికి మించి పనితీరు కనపర్చేలా చూసుకోవాలని, తద్వారా ఆర్థికంగా విశ్వసనీయమైనదిగా, కస్టమర్ ఆధారిత సొల్యూషన్స్‌ను అందించడంలో దిగ్గజంగా మా స్థానాన్ని పటిష్టంచేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం' అని బంధన్ బ్యాంక్ ఈడీ, సీఈవో రాజీందర్ బబ్బర్ తెలిపారు. 
 
రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎంబంధన్ మొబైల్ అప్లికేషన్ ద్వారా కస్టమర్లు తమ ఇంటి నుంచి లేదా ఆఫీసు నుంచే సౌకర్యవంతంగా ఎఫ్‌డీని బుక్ చేయడం లేదా ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించిన ప్రయోజనాలను బంధన్ బ్యాంకు కస్టమర్లు ఆస్వాదించవచ్చు. బ్యాంకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల గురించి మరిన్ని వివరాలు, సమాచారం కోసం దయచేసి https://bandhanbank.com/rates-chargesని విజిట్ చేయండి.