గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (11:16 IST)

తెలుగు ప్రజలు అలా చేస్తున్నారా? అరుణ్ జైట్లీ ఇలా అనేశారే? ఏమన్నారు?

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలుగు ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడుతుందన్నారు. ఇందుకు కారణం.. త

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలుగు ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడుతుందన్నారు. ఇందుకు కారణం.. తెలుగు ప్రజలు భారీ ఎత్తున కరెన్సీని ఇళ్లల్లో దాచుకుంటున్నారని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఇలా పెద్ద మొత్తాన్ని డబ్బు కట్టల్ని ఇళ్లల్లో దాచుకోవడం ద్వారానే నోట్ల కొరత ఏర్పడిందనే అర్థం వచ్చేలా జైట్లీ వ్యాఖ్యానించారు. 
  
అరుణ్ జైట్లీ బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన వద్దకు తెలంగాణ బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి పుష్పలీల కల్పించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో డబ్బులు లేవని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 
 
అందుకే అదనంగా డబ్బు పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు స్పందించిన జైట్లీ.. ఇప్పటికే అధిక కరెన్సీ నోట్లను తెలుగు రాష్ట్రాలకు పంపించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రజలు నోట్ల కట్టలను బ్యాంకు లాకర్లలో, ఇళ్లల్లో దాచుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చి వుండవచ్చునని జైట్లీ భావించారు.