Widgets Magazine

ఆర్థిక సంక్షోభంలో పాక్... దారుణంగా పడిపోయిన మారకం విలువ

బుధవారం, 13 డిశెంబరు 2017 (11:26 IST)

pak currency

చిరకాల మిత్రదేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకోనుంది. ఆ దేశ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఫలితంగా విదేశీ ద్రవ్య నిల్వలు 12.9 బిలియన్ డాలర్లకు చేరాయి. పాకిస్థాన్‌లో రోజురోజుకూ దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆ దేశ సెంట్రల్ బ్యాంకు చేపట్టిన ప్రయత్నాలు కూడా ఏమాత్రం ఫలించడం లేదు. 
 
ఫలితంగా మంగళవారం పాకిస్థాన్ రూపాయి మారకం విలువ మరింతగా దిగజారింది. సాయంత్రం 4:57 గంటలకు కరాచీలో ఆ దేశ రూపాయి మారకం విలువ దారుణంగా క్షీణించింది. 1.9 శాతం క్షీణించి డాలర్‌కు 109.5 రూపాయలకు చేరుకుంది. శుక్రవారం తర్వాత ప్రపంచవ్యాప్తంగా మారకం విలువ ఇంత దారుణంగా క్షీణించడం ఇదే తొలిసారి.
 
రూపాయి మారకం విలువ పడిపోవడంపై పాక్ ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి వకార్ మసూద్ మాట్లాడుతూ ‘ఇది అసాధారణం’ అని పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పడిపోతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకునేందుకు ప్రభుత్వం గతనెలలో 2.5 బిలియన్ డాలర్లు అప్పు చేసిందని చెప్పారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

రూ.22కే పెట్రోల్ - ఎప్పటి నుంచో తెలుసా?

పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడే సామాన్య ప్రజలకు కేంద్రం ఒక శుభవార్త చెప్పింది. పెట్రోల్ ...

news

త్వరలోనే పెట్రోల్ ధరలు తగ్గుతాయ్ : నితిన్ గడ్కరీ

దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. పొరుగు దేశాలతో పోల్చితే భారత్‌లో పెట్రో మంటలు తారా ...

news

ఆధార్-పాన్ అనుసంధానం: మార్చి31 2018 వరకు గడువు పెంపు

ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డులు, బ్యాంకు ఖాతాలకు లింక్ చేసేందుకు డిసెంబర్ 31వరకు యూఐడీఏ ...

news

కొత్త నోట్ల రంగులేంటి? సైజులేంటి? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న

పెద్దనోట్లను రద్దు చేసిన అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నోట్లను ...

Widgets Magazine