శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By PNR
Last Updated : సోమవారం, 8 సెప్టెంబరు 2014 (16:33 IST)

హెల్తీ అండ్ టేస్టీ "టమోటో హల్వా"

కావలసిన పదార్థాలు :
ఎర్రగా పండిన టమోటోలు.. పది
పంచదార.. రెండు కప్పులు
నెయ్యి.. ఒక కప్పు
జీడిపప్పు, బాదంపప్పు.. రెండూ కలిపి అర కప్పు
బొంబాయి రవ్వ.. ఒక కప్పు
యాలకుల పొడి.. రెండు టీ.
 
తయారీ విధానం :
ముందుగా టమోటో పండ్లను ఉడికించి గుజ్జు తీయాలి. బాణలిలో నెయ్యి వేడిచేసి ముందుగా జీడిపప్పు, బాదంపప్పు వేయించాలి. ఆ తరువాత అదే బాణలిలో బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించాలి. మరో పాత్రలో రెండు కప్పుల నీరు తీసుకుని మరిగించి, వేయించిన బొంబాయి రవ్వను కలపాలి. ఇది దగ్గరపడిన తరువాత టొమోటో గుజ్జు, పంచదార, జీడిపప్పు, బాదంపప్పు, నెయ్యి వేసి కలియబెట్టాలి. చివర్లో యాలకుల పొడి చల్లితే రుచికరమైన టమోటో హల్వా సిద్ధమైనట్లే..!!