Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మాస్టర్ బ్లాస్టర్ తొలి డబుల్ సెంచరీకి 8 యేళ్లు

శనివారం, 24 ఫిబ్రవరి 2018 (17:19 IST)

Widgets Magazine
sachin

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు క్రికెట్ ప్రయాణం సాగించాడు. ఈ ప్రయాణంలో వన్డేలు, టెస్టుల్లో కలుపుకుని 100 సెంచరీలు ఉన్నాయి. అలాగే, అత్యధిక పరుగుల రికార్డు, ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల మనసు దోచుకున్న ఆ దిగ్గజ క్రికెటర్‌కు ఇంక ఏదో సాధించాలనే కసి. ఆరోజు కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశాడు. చివరికి అతని కల నెరవేరింది.
 
అది 2010 ఫిబ్రవరి 24. గ్వాలియర్‌లో సౌతాఫ్రికా, భారత్ మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా ఓపెనర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ సమయంలో సచిన్ వయసు 37 ఏళ్లు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ ఇన్నింగ్స్ ఆడుతూ.. 50, 100, 150, 190.. ఇలా దాటుతుండగానే అభిమానులంతా టెన్షన్‌కు గురయ్యారు. 
 
ఔట్‌కాకుండా 200 పరుగులు చేయాలని మైదానంలోని ప్రతి అభిమాని తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నారు. ఇన్నింగ్స్‌లో ఆఖరి వరకు ఆడిన సచిన్ 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో వన్డేల్లో తొలిసారి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా క్రికెట్ దేవుడు సచిన్ చరిత్ర సృష్టించాడు. 
 
అభిమానులకు అభివాదం చేసిన సచిన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆరోజు సచిన్‌తో పాటు బ్యాటింగ్ చేసిన భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీ మైలురాయి సాధించడంలో మంచి సహకారం అందించాడు. అంతకుముందు వన్డేల్లో 194 అత్యధిక స్కోరు. ఆ తర్వాత భారత స్టార్ క్రికెటర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు చూసి వారెవ్వా అనిపించిన విషయం తెలిసిందే. సచిన్ చేసిన ఈ తొలి డబుల్ సెంచరీకి నేటితో సరిగ్గా 8ఏళ్లు పూర్తయ్యాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

మధును చంపేసిన సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా : సెహ్వాగ్

బడాబాబులు దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయి.. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. ...

news

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ట్వంటీ20 సిరీస్ : నేడు ఫైనల్ మ్యాచ్

ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా, ఆతిథ్య సౌతాఫ్రికా జట్టుతో పర్యాటక భారత్ జట్టు నేడు తుది సమరంలో ...

news

క్రికెట్ బోర్డులో ముసలం.. జట్టు జట్టంతా మూకుమ్మడి రాజీనామాలు

సంచలనాలకు మారుపేరైన కెన్యా క్రికెట్ బోర్డులో ముసలం చెలరేగింది. ఫలితంగా ఆ దేశ క్రికెట్ ...

news

బౌలర్లకూ ఇక హెల్మెట్ తప్పదా? బలంగా బాదడంతో బంతి అక్కడ తాకి?

న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్లో భయానక సంఘటన చోటుచేసుకుంది. బంతి తగలడంతో కొందరు గాయాలైతే.. ...

Widgets Magazine