Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చరిత్ర సృష్టించిన భారత కుర్రోళ్ళు: అండర్-19 వరల్డ్ కప్ కైవసం

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (14:08 IST)

Widgets Magazine
un

భారత యువ క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. అండర్-19 వరల్డ్ కప్‌ను మరోమారు తమ వశం చేసుకున్నారు. ది ఓవెల్ మైదానంలో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన తుది పోరులో నాలుగోసారి విశ్వవిజేతలుగా నిలిచారు. 217 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత యువ జట్టు... కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయి విజయలక్ష్యాన్ని చేరుకున్నారు. 
 
భారత ఓపెన‌ర్ మ‌న్‌జోత్ కైరా (101) అజేయ శ‌త‌కంతో భారత్ సునాయాసంగా ల‌క్ష్యాన్ని ఛేదించింది. దేశాయ్ (47 నాటౌట్‌) స‌హ‌కార‌మందించాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 217 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 38.5 ఓవర్ల‌లోనే రెండు వికెట్లు కోల్పోయి భార‌త్ ఛేదించింది. 
 
అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు 47.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత యువ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ ఆటగాళ్లు పరుగులు చేసేందుకు కంగారు పడిపోయారు. ఈ మ్యాచ్ ఆరంభంలో బాగానే ఆడినా.. స్పిన్న‌ర్లు దిగిన త‌ర్వాత సీన్ మారిపోయింది. 
 
ఇషాన్ పోరెల్‌, న‌గ‌ర్‌కోటి, అనుకూల్‌రాయ్‌, శివ సింగ్ తలా నాలుగు వికెట్లు తీసుకున్నారు. ఒక ద‌శ‌లో 134 ప‌రుగుల‌కే 3 వికెట్ల‌తో ఉన్న ఆసీస్‌.. 82 ప‌రుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా చివ‌రి ప‌ది ఓవ‌ర్ల‌లో ఆసీస్‌ను భారత బౌలర్లు పూర్తిగా క‌ట్ట‌డి చేశారు. 
 
కాగా, ఈ విజ‌యంతో భార‌త్ ఖాతాలో నాలుగో సారి ప్ర‌పంచ‌క‌ప్ చేరింది. దీంతో అత్య‌ధిక ప్ర‌పంచ‌క‌ప్‌లు నెగ్గిన జ‌ట్టుగా భార‌త్ అవ‌త‌రించింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా స‌త్తా చాటింది. భారత యువ జట్టుకు క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్న విషయం తెల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

అండర్-19 వరల్డ్ కప్ : భారత్ ముంగిట 217 పరుగుల టార్గెట్

అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శనివారం భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తుది పోరు ...

news

డర్బన్‌లో సఫారీలను చితక్కొట్టిన కోహ్లీ సేన

సొంత గడ్డపై వరుసగా 17 మ్యాచ్‌లు నెగ్గిన జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు టీమిండియా ...

news

149 ఫోర్లు... 65 సిక్సర్లు... 1045 పరుగులు...

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఓ అరుదైన రికార్డు నమోదైంది. 13 యేళ్ల బుడతడు ఒకడు అండర్ 14 ...

news

అండర్ 19 వరల్డ్ కప్ : పాక్‌పై భారత్ ఘన విజయం

న్యూజిలాండ్‌లోని క్రెస్ట్ చర్చ్ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ...

Widgets Magazine