గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2018 (09:52 IST)

దక్షిణాఫ్రికాపై ఆరో గెలుపు మనదే.. కోహ్లీ అదుర్స్.. భారత్ ఘనవిజయం

దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 32.1 ఓవర్లలోనే 206 పరుగులతో చేధించి... 5-1 తేడాతో సిరీస

దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 32.1 ఓవర్లలోనే 206 పరుగులతో చేధించి... 5-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి సిరీస్‌ను గెలుచుకుని టీమిండియా సరికొత్త రికార్డును సృష్టించింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. బౌలర్ల దెబ్బకు 204పరుగులకే సఫారీ టీమ్ ఆలౌట్ అయ్యింది. ఆపై బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యారు. అయితే రోహిత్ శర్మ ఔటైన అనంతరం క్రీజులోకొచ్చిన కోహ్లీ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 82 బంతుల్లో 103 పరుగులు చేసిన కోహ్లీ 17ఫోర్లతో సఫారీ బౌలర్లపై పంజా విసిరాడు. కోహ్లీ సెంచరీతో భారత్ గెలుపు సునాయాసమైంది. 
 
ఇకపోతే.. 129 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ, ఈ సిరీస్‌లో మూడో సెంచరీ చేసి జట్టుకు భారీ విజయం అందించాడు. ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్''తో పాటు, ''మ్యాన్ ఆఫ్ ది సిరీస్"ను సైతం కోహ్లీ సొంతం చేసుకున్నాడు.