శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (14:21 IST)

ధోనీ.. అగ్నిశిఖలా దూసుకుపోతున్నాడు : మైఖేల్ క్లార్క్

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ 'అగ్నిశిఖలా దూసుకుపోతున్నాడు' అంటూ వ్యాఖ్యానించాడు. దిగ్గజ ఆటగాడైన ధోనీ ఖచ్చితంగా 2019

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ 'అగ్నిశిఖలా దూసుకుపోతున్నాడు' అంటూ వ్యాఖ్యానించాడు. దిగ్గజ ఆటగాడైన ధోనీ ఖచ్చితంగా 2019 వన్డే ప్రపంచ కప్ జట్టులోనే కాదు 2023లో జరిగే వరల్డ్ కప్ జట్టులోనూ సభ్యుడిగా ఉంటాడంటూ జోస్యం చెప్పారు.
 
భారత జట్టు శ్రీలంకలో పర్యటించినపుడు ఆ దేశంతో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌తో కెరీర్‌లోనే 300వ వన్డే మ్యాచ్‌ను ఆడాడు. అలాగే, చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కూడా చివరివరకు క్రీజ్‌లో నిలబడి జట్టుకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు. 
 
దీనిపై క్లార్క్ స్పందిస్తూ, ఈ వయసులో కూడా ధోనీ ఇలా రాణించడానికి అతని ఏకాగ్రత, ఆటపై ఉన్న మక్కు, శక్తిసామర్థ్యాలు, ప్రశాంత వదనాలే కారణమని క్లార్క్ చెప్పారు. ధోనీ ప్రతిభ, ఆటతీరుపై తనకేమాత్రం సందేహం లేదన్నారు. 
 
తీవ్ర ఒత్తిడిలోనూ ధోనీ అద్భుత ఆటతీరుతో రాణించి లంకపై 5-0తో టీమిండియాను గెలిపించాడన్నారు. లంకతో వన్డే సిరీస్ ఫలితమే ధోనీ నైపుణ్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. వచ్చే వరల్డ్ కప్ జట్టులో ధోనీ ఉంటాడో లేదోనని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ధోనీ రాణించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. 
 
టాపార్డర్ వికెట్లు త్వరగా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్య (66 బంతుల్లో 83) సాయంతో ధోనీ (88 బంతుల్లో 79) ముందుకు నడిపించి తొలి వన్డే నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడని ఆసీస్ మాజీ దిగ్గజం మైఖెల్ క్లార్క్ గుర్తుచేశాడు.