వచ్చే ఆరేళ్లకు ఢోకా లేదు.. కోహ్లీ సేన ఉతికేయడం ఖాయం.. కుంబ్లే

virat kohli
Last Updated: గురువారం, 10 జనవరి 2019 (13:27 IST)
ప్రపంచ క్రికెట్ రంగంలో వచ్చే ఆరేళ్లకు విరాట్ కోహ్లీ సేన ఆధిత్యం చెలాయిస్తుందని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు. ఇటీవల ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.


దీనిపై ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీ సేనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. మాజీ కెప్టెన్ కుంబ్లే స్పందించాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాను కొనియాడాడు. 
 
ఆసీస్ గడ్డపై టీమిండియా నెగ్గుతుందని ముందుగానే భావించాం. గణాంకాల మేర 2-1 తేడాతో కోహ్లీసేన సిరీస్‌ను నెగ్గింది. ఇందుకు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో టీమిండియా క్రికెటర్లు రాణించడమే కారణం.

ప్రస్తుతానికి మన టీమిండియా వచ్చే ఆరేళ్లకు ప్రపంచ క్రికెట్‌లో భారీ ఆధిక్యాన్ని కలిగివుంటుందని.. యంగ్ క్రికెటర్లు కూడా భారత జట్టులో భాగం అవుతారని కుంబ్లే వ్యాఖ్యానించాడు. తద్వారా భారత జట్టుకు మరింత బలం చేకూరుతుందని కుంబ్లే అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీనిపై మరింత చదవండి :