Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాహుల్ ద్రావిడ్‌ను ప్రధానమంత్రిని చేయాలంటున్న నెటిజన్లు.. ఎందుకు?

మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (14:11 IST)

Widgets Magazine
rahul dravid

భారత అండర్-19 క్రికెట్ జట్టు కోచ్, క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌ను దేశ ప్రధానమంత్రిని చేయాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వారు అలా డిమాండ్ చేయడం వెనుక ఓ బలమైన కారణం లేకపోలేదు. 
 
రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్న అండర్ 19 జట్టు ఇటీవల ప్రపంచ విజేతగా నిలిచిన విషయం తెల్సిందే. దీంతో జట్టుతో పాటు.. కోచ్, ఇతర సహాయక సిబ్బందికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భారీ మొత్తంలో నజరానా ప్రకటించింది. ఇందులో కోచ్‌కు రూ.50 లక్షలు, టీమ్ సభ్యులకు రూ.30 లక్షలు, కోచింగ్ స్టాఫ్‌కు రూ.20 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.
 
దీనిపై ద్రావిడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. అందరూ సమానంగా కష్టపడితేనే వరల్డ్‌కప్ సాధ్యమైందని, అలాంటిది ఒక్కొక్కరికీ ఒక్కో నజరానా ఎందుకని బోర్డును బహిరంగంగా ప్రశ్నిస్తూ, అందరికీ సమంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్‌కు బీసీసీఐ తల వంచింది. కోచ్ ద్రావిడ్‌కు ఇచ్చిన రూ.50 లక్షల ప్రైజ్‌మనీలో రూ.25 లక్షలు కోతవిధించి... మిగిలిన సభ్యులకు కూడా రూ.25 లక్షల చొప్పున నజరానా ఇచ్చింది. 
 
ఇది చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. అసలు ఇలాంటి వాడే కదా మనకు కావాల్సింది అంటూ ద్రవిడ్‌పై ప్రశంసలు కురిపించారు. పక్కవాళ్ల బాగోగుల గురించి ఆలోచించే ద్రవిడ్.. నిజమైన లెజెండ్ అని కొనియాడారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ విశాల్ మొదట ప్ర‌ధాన‌మంత్రిని చేయాల‌ని ప్ర‌తిపాదించ‌గా.. మిగిలిన నెటిజన్లంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోయింది. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఇక మహిళా క్రికెటర్లకు ఐపీఎల్ మ్యాచ్‌లు..

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ క్రికెట్ ఇక పురుషులకే కాదు.. మహిళలకూ సొంతం కానుంది. కేవలం ...

news

శిఖర్ ధావన్‌కు హెడ్ మసాజ్ చేసిన విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే, ...

news

రాహుల్ ద్రావిడ్‌కు తేరుకోలేని షాకిచ్చిన బీసీసీఐ

భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్‌కు భారత క్రికెట్ కంట్రోల్ ...

news

ముషారఫ్ నాకు వార్నింగ్ ఇచ్చారు.. సౌరవ్ గంగూలీ

టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీకి 2004లో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఓ ...

Widgets Magazine