Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మంచినీళ్ల ప్రాయంలా శతకాలు బాదేస్తున్న క్రికెటర్...

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (10:08 IST)

Widgets Magazine
virat kohli

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచినీళ్ల ప్రాయంలా శతకాలు బాదేస్తున్నాడు. అది ఎలాంటి ఫార్మెట్ అయినా సరే శతకాలు కొట్టడమే తనకంటే మొనగాడు ఎవ్వరూ లేరని చేతల్లో నిరూపిస్తున్నాడు. ఫలితంగా టెస్టులు, వన్డేల్లో కలిపి అత్యధిక శతకాలు చేసిన వీరుల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. 
 
ఇప్పటివరకు వన్డేల్లో 34వ సెంచరీ చేసిన విరాట్‌.. (టెస్టుల్లో 21) మొత్తంగా తన శతకాల సంఖ్యను 55కు పెంచుకున్నాడు. తద్వారా చెరో 54 శతకాలతో ఉన్న సౌతాఫ్రికా క్రికెటర్ ఆషీమ్ ఆమ్లా, శ్రీలంక మాజీ క్రికెటర్ జయవర్దనెలను కోహ్లీ వెనక్కునెట్టాడు. 
 
కాగా, ఈ జాబితాలో వంద సెంచరీలతో సచిన్‌ (51+49) మొదటిస్థానంలో ఉన్న విషయం తెల్సిందే. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌ (71), లంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర (63), దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్‌ కలిస్‌ (62) తర్వాతి స్థానంలో ఉన్నారు. 
 
అలాగే, భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు కొట్టిన రికార్డును కూడా కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ 11 సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ 12 సెంచరీలు చేసి ఆ రికార్డును అధికమించాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

సఫారీలను చితక్కొట్టిన విరాట్ కోహ్లీ : మూడో వన్డేలో విజయభేరీ

సఫారీ గడ్డపై భారత క్రికెటర్లు సింహాల్లో గర్జిస్తున్నారు. ఆతిథ్య జట్టును ...

news

పాక్ లెఫ్టార్మ్ పేస‌ర్‌ను మాత్ర‌మే నేను అభినందించా : రాహుల్ ద్రావిడ్

అండర్-19 వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్థాన్ జట్టు డ్రెస్సింగ్ రూంకు వెళ్లి వారితో ...

news

నేను పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లలేదు.. పేస్ బౌలర్‌ని అభినందించా: ద్రవిడ్

అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా యువ జట్టుకు ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ ...

news

మా కుర్రాళ్లపై చేతబడి జరిగింది... అందుకే ఇండియాపై ఓడిపోయాం... పాక్ టీమ్ మేనేజర్

అండర్ 19 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ పోటీలో టీమిండియా కుర్రాళ్ల చేతుల్లో అత్యంత దారుణంగా ...

Widgets Magazine