బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (15:23 IST)

పాఠం నేర్పిన గోవా రిజల్ట్స్ ... ఆగమేఘాలపై మేఘాలయకు పరుగోపరుగు

గోపా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఓ మంచి గుణపాఠం నేర్పాయి. ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయింది.

గోపా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఓ మంచి గుణపాఠం నేర్పాయి. ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయింది. కమలనాథులు వ్యూహాత్మకంగా పావులు కదిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదురైనా బీజేపీ అధిష్టానం మాత్రం వెనక్కి తగ్గలేదు. 
 
ఈ నేపథ్యంలో శనివారం మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 21 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అదేసమయంలో బీజేపీ 16 సీట్లలో గెలవగా, ఎన్.పి.పి 16 సీట్లలో, ఇతరులు 10 చోట్ల గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వరాదన్న పట్టుదలతో ఉంది. 
 
ఇందుకోసం ఇతర పార్టీల మద్దకు కూడగట్టేందుకు పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలను కాంగ్రెస్ హుటాహుటిన షిల్లాంగ్ పంపింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, కమల్‌నాథ్‌లు ఉదయమే షిల్లాంగ్ బయలుదేరారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తక్షణమే వీరు గెలిచిన స్వతంత్ర అభ్యర్థులతో మంతనాలు సాగించనున్నారు.