శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (11:58 IST)

త్రిపుర - నాగాలాండ్‌లలో బీజేపీ పాగా.. మేఘాలయ కాంగ్రెస్ హవా

ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా త్రిపురలో 25 యేళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎం కంచుకోటను భారతీయ జనతా పార్టీ బద్ధలు కొట్టింది.

ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా త్రిపురలో 25 యేళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎం కంచుకోటను భారతీయ జనతా పార్టీ బద్ధలు కొట్టింది. మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు జరుగగా, 41 చోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార సీపీఎం మాత్రం 18 సీట్లకే పరిమితమైంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఏకపక్ష విజయం. 
 
అలాగే, మేఘాలయలో కాంగ్రెస్ పదేళ్లుగా అధికారంలో ఉండగా, నాగాలాండ్‌లో మూడు నెలల రాష్ట్రపతి పాలన మినహా 2003 నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) అధికారాన్ని చలాయిస్తోంది. ఇక్కడు ఇపుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 28 చోట్ల, ఎన్.పి.పి. 13, ఇతరులు 10, బీజేపీ 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
 
ఇకపోతే, నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ పాగా వేసింది. మొత్తం 59 చోట్ల ఎన్నికలు జరుగగా, బీజేపీ ఏకంగా 32 చోట్ల, ఎన్.పి.ఎఫ్ 24 చోట్ల, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.