పవన్ ఆ ఒక్క ట్వీట్.. టీడీపీతో తెగతెంపులకు సంకేతమా?

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (15:38 IST)

pawan kalyan-smile

తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ దాదాపుగా తెగతెంపులు చేసుకున్నట్టే తెలుస్తోంది. అదీ కూడా ఒక్క ట్వీట్‌తో పవన్ కల్యాణ్ తన మనసులోని మాటను చెప్పకనే చెప్పారు. ఈ ట్వీట్ శుక్రవారం ఉదయం చేశారు. ఈ ట్వీట్ ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
ఎజెండా, జెండాలేని పవన్ గురించి ఆలోచించే తీరిక, సమయం తనకు లేవని మంత్రి పితాని సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను, గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ, వారికి తానెవరో తెలియదు, సంతోషమని పవన్ పెట్టిన ట్వీట్‌ను విశ్లేషిస్తున్న రాజకీయ నిపుణులు, తెదేపాతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆయనిలాంటి ట్వీట్ చేసుంటారని అంచనా వేస్తున్నారు. 
 
ఒక్క ట్వీట్‌తో ఆయన తన వైఖరిని స్పష్టం చేశారని, తన బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారంటూ హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసుంటారని అంటున్నారు. 2014 ఎన్నికల్లో ప్రచారానికి తనను వాడుకుని, ఇప్పుడు తానెవరో తెలియదంటూ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఎంత ఆగ్రహంగా ఉండకపోతే, పేర్లను ప్రస్తావిస్తూ మరీ పవన్ వ్యంగ్యాస్త్రాన్ని వదులుతూ కామెంట్స్ చేస్తున్నారంటూ విశ్లేషకులు. దీనిపై మరింత చదవండి :  
Tweet Alliance Janasena Telugudesam Party Tdp Ministers Pawan Kalyan

Loading comments ...

తెలుగు వార్తలు

news

చెల్లెమ్మా నీ కృషి అభినందనీయం... టీబీజీకేఎస్ ఫలితాలపై కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ ...

news

పవన్ కూడా పగలబడి నవ్వుతారు... బాబు ఇలా కేసీఆర్ అలా... #WorldSmileDay

నవ్వడం ఓ భోగం... నవ్వలేకపోవడం ఓ రోగం అన్నారు పెద్దలు. అందుకే ఒక్క నవ్వే చాలు వద్దులే ...

news

మేనకోడలు ప్రేమ వివాహం.. ఇంటి ముందే కాపురం.. మేనమామలు ఏం చేశారంటే?

మేనకోడలు ప్రేమించి వివాహం చేసుకోవడమే కాకుండా.. వారింటి ముందే కాపురం పెట్టడంతో మేనమామలు ...

news

శశికళకు పెరోల్‌ మంజూరు... దినకరన్‌కు షాక్.. గవర్నర్‌గా పురోహిత్ ప్రమాణం

అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ...