శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Selvi
Last Updated : శనివారం, 26 జులై 2014 (18:45 IST)

హృద్రోగ, ఒబిసిటీలకు చెక్ పెట్టే హాట్ హాట్ బార్లీ సూప్!

హృద్రోగ, ఒబిసిటీలకు చెక్ పెట్టే హాట్ హాట్ బార్లీ సూప్.. ట్రై చేయండి. అసలే వర్షాకాలం వర్షాలు కురవకపోయినా.. కాలధర్మాన్ని బట్టి ఈ సీజన్‌లో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. బార్లీ తేలిగ్గా జీర్ణమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ బార్లీ సూప్ తాగితే మంచి ఫలితం ఉంటుంది.  
 
వంద గ్రాముల బార్లీ గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 
కొలెస్ట్రాల్ 1.3 
పీచు 11.5 గ్రాములు 
కార్బొహైడ్రేడ్ 69.6
క్యాల్షియం - 26 మి. గ్రాములు 
ఫాస్పరస్ -215 మి.గ్రాములు  
  
ఇక బార్లీ సూప్ ఎలా చేయాలంటే?
కావలసిన పదార్థాలు :
బార్లీ - అరకప్పు 
బీన్స్, క్యారట్, క్యాబేజీ ముక్కలు - ఒక కప్పు 
వెల్లుల్లి - (మీకు నచ్చితే) 5 రెబ్బలు 
రెడీమేడ్ సూప్ పౌడర్ - అర టీ స్పూన్ 
మిరియాల పొడి, ఉప్పు- తగినంత 
ఫ్యాట్ లెస్ మిల్క్ - కాసింత 
 
తయారీ విధానం :  
బార్లీని 8 గ్లాసుల నీటిలో ఉడికించాలి. సగం ఉడికాక కూరగాయ ముక్కల్ని, వెల్లుల్లి ముక్కల్లి చేర్చుకోవాలి. వెజిటబుల్స్ కూడా హాఫ్ బాయిల్ అయ్యాక సూప్ క్యూబ్స్ లేదా ఇన్స్‌స్టెంట్ సూప్ పౌడర్‌ను చేర్చి కాసేపు మరిగించాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, పాలు చేర్చి హాట్ హాట్‌గా కార్న్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.