మష్రూమ్స్‌తో మంచూరియానా? ఎలా?

పుట్టగొడుగులు తినడం వలన గుండె జబ్బులు డయాబెటిస్, క్యాన్సర్ వ్యాధులు నిరోధించబడుతాయి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్‌కు కూడా పుట్టగొడుగులు బలమైన శ్రేష్టమైన ఆహారంగా సహాయపడుతాయి. మరి ఇటువంటి పుట్టగొడుగులతో మం

Kowsalya| Last Updated: బుధవారం, 11 జులై 2018 (12:52 IST)
పుట్టగొడుగులు తినడం వలన గుండె జబ్బులు డయాబెటిస్, క్యాన్సర్ వ్యాధులు నిరోధించబడుతాయి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్‌కు కూడా పుట్టగొడుగులు బలమైన శ్రేష్టమైన ఆహారంగా సహాయపడుతాయి. మరి ఇటువంటి పుట్టగొడుగులతో మంచూరియా ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
మష్రూమ్స్‌ - 200 గ్రా 
మిరియాల పొడి - స్పూన్ 
బియ్యప్పిండి - 3 స్పూన్స్
మైదా - 3 స్పూన్స్ 
కార్న్‌ఫ్లోర్‌ - 3 స్పూన్స్ 
ఉప్పు - తగినంత 
కారం - స్పూన్ 
నీరు - అరకప్పు 
నూనె - సరిపడా 
ఉల్లిపాయలు - 2 
వెల్లుల్లి రెబ్బలు - 4 
సోయా సాస్‌ - 2 స్పూన్స్ 
పచ్చిమిర్చి - 4
టమోటా సాస్‌ - 1 స్పూన్ 
టమోటా ప్యూరీ - 2 స్పూన్స్ 
కొత్తిమీర తరుగు - అలంకరణకు
 
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్‌, మైదా, కారం, ఉప్పు వేసి నీటితో జారుగా కలుపుకోవాలి. రెండు ముక్కలుగా తరిగిన మష్రూమ్స్‌ను ఆ మిశ్రమంలో ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో రెండు స్పూన్స్ నూనె వేసి ఉల్లి తరుగు, పొడుగ్గా చీరిన పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు చిటికెడు ఉప్పు వేసి వేగించాలి. ఆ తరువాత సోయా సాస్‌, టమోటా ప్యూరీ, సాస్‌ వేయాలి. రెండు నిమిషాల తరువాత పక్కనుంచిన మష్రూమ్స్‌ వేసి చిక్కబడేవరకు ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే మష్రూమ్స్ మంచూరియా రెడీ.దీనిపై మరింత చదవండి :