శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 మే 2017 (14:35 IST)

4 సింపుల్ నియమాలతో 120 రోగాలు దూరం.. ఏంటవి?

"ఆరోగ్యమే మహాభాగ్యం" అన్నారు మన పెద్దలు. ఎందుకంటే మనం ఏదైనా చేయాలి అంటే మనం ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలి. పూర్వపు రోజుల్లో శారీరకశ్రమ అధికంగా చేసేవారు దానితో వారికి తెలియకుండానే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వ

"ఆరోగ్యమే మహాభాగ్యం" అన్నారు మన పెద్దలు. ఎందుకంటే మనం ఏదైనా చేయాలి అంటే మనం ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలి. పూర్వపు రోజుల్లో శారీరకశ్రమ అధికంగా చేసేవారు దానితో వారికి తెలియకుండానే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కానీ, ఈ రోజుల్లో శారీరకశ్రమ తక్కువ మానసికశ్రమ ఎక్కువ కావడటం వలన అనారోగ్యంకొని తెచ్చుకుంటున్నారు. అందుకే ఒక నాలుగు నియమాలు పాటిస్తే దాదాపు 120 రోగాలకు దూరంగా ఉండొచ్చని వైద్యులు చెపుతున్నారు. ఆ నాలుగు నియమాలు ఏంటో ఓ సారిపరిశీలిద్ధాం. 
 
నియమం.. 1
ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే కనీసం 2-3 గ్లాసుల నీరు తాగాలి. ఇలాంటి అలవాటు కొద్దీ మందికి ఉంటుంది. వారు లేవగానే ముందు నీళ్లు తాగిన తర్వాతనే ఏదైనా పనిచేస్తారు. ఇలా నిద్రలేవాగానే నీళ్లు తాగడం వల్ల రాత్రి నుంచి ఉదయం వరకు శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలన్నీ మల, మూత్ర విసర్జన రూపంలో బయటకి వెళ్తాయి. ఇలా చేయడం వల్ల మలమూత్ర విసర్జన రెండూ ఒకేసారి పూర్తవుతాయి. ఒకేసారి రెండు విసర్జిస్తే వారికి రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ. ఇంట్లో రాగి చెంబుగాని ఉంటే... రాత్రి పడుకునే ముందు రాగి చెంబులో నీటిని నింపి ఉదయం లేవాగానే తాగితే మంచి ఫలితం ఉంటుంది. 
 
నియమం.. 2
భోజనం చేసే ముందు 40 నిమిషాలు, అన్నం ఆరగించిన తర్వాత ఒక గంట పాటు నీరు తాగొద్దు. నిజానికి తినడానికి ముందు కానీ తిన్న తర్వాత కానీ నీళ్లు తాగకూడదు మనం ఎప్పుడైతే తిన్న ఆహారం పొట్టలోని ఈసోపేగాస్‌లోకి వెళతాయి. అక్కడ హైడ్రాలిక్ యాసిడ్ సూక్ష్మక్రిములను చంపేసి కొంత ఆహారాన్ని యాంత్రికంగా ముక్కలు చేస్తుంది. తక్కువ పీహెచ్ విలువ కలిగిన హైడ్రోక్లోరిన్ యాసిడ్ ఎంజైమ్‌లకు ఉపయోగపడి మనం తిన్న ఆహారం త్వరితంగా జీర్ణమైశక్తిని విడుదలయ్యేలా చేస్తుంది. ఈ ప్రక్రియ జరుగుతున్నా సమయంలో మనంతిన్న వెంటనే నీళ్లు తాగితే, మన జీర్ణ వ్యవస్థ నెమ్మెదిస్తుంది. దానితో జీర్ణం తర్వాత వ్యర్థలు శరీరంలో అలాగే మిగిలిపోతాయి. దానితో అనేక రోగాలు వస్తాయి. అందుకే తినడానికి ముందు తిన్న తర్వాత కానీ నీళ్లు తాగొద్దు. 
 
నియమం.. 3
బాగా చల్లగా ఉండే నీరు సేవించకూడదు. ఇది చాలా ప్రమాదకరం కూడా. ఎందుకంటే మన శరీరంలో ఎప్పుడు ఎదో ఒక క్రియ జరుగుతూనే ఉంటుంది. దాంతో మన శరీరం అంతవేడిగా ఉంటుంది. కూల్ వాటర్ తాగితే రెండు భిన్న వ్యతిరేకమైన టెంపరేచర్ మన శరీరం మీద పడి చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. చల్లటి నీళ్లు తాగాలంటే కుండలో నీళ్లు ఆరోగ్యానికి చాల మంచివి. ఆరోగ్యానికి మంచిది కూడా. 
 
నియమం.. 4 
చాలా మంది నీరు గటగటా తాగేస్తుంటారు. అలా చేయకూడదు. నీళ్లను మనం టీ, కాఫీ ఏవిధంగా తాగుతామో అలాగే తాగాలి. ఎందుకంటే నీళ్లను గటగటా తాగడం వల్ల శరీరంలోని హైడ్రోక్లోరిన్ ఎక్కువ మొత్తంలో చర్య జరపాల్సి ఉంటుంది. దాంతో అధిక ఎసిడిటి ఏర్పడుతుంది. ఈ ఎసిడిటి మన శరీరంలోని రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. దాంతో అనేక రకాలైన రోగాలు వస్తాయి. నీళ్లను సిప్ చేస్తూ తాగడం వలన ప్రతి గుటక నీటితో, మన నోటిలో ఉండే లాలాజలం కొంత మొత్తంలో శరీరంలోకిపోతుంది. దీంతో ఎలాంటి హాని కలగదు. ఈ నాలుగు నియమాలు పాటీస్తే జీవించినంత కాలం ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.