ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (17:07 IST)

టెన్షన్ పడడం మంచిదేనా..?

టెన్షన్ కారణంగా రక్తపోటు, గుండెజబ్బు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కొందరు అదేపనిగా హెచ్చరిస్తుంటే నిపుణులు మాత్రం స్త్రీల విషయంలో టెన్షన్ మంచిదే అంటున్నారు. ఎలాగంటే సాధరణంగా స్త్రీలు తమ ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపరు. టెన్షన్ అస్సలు పడరు. కానీ ఇలాంటి వారు తమ విషయంలో టెన్షన్ పడితేనే మంచిది అంటున్నారు.
 
ఆరోగ్యం గురించి తరచూ టెన్షన్ పడేవారు ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొన్ని ప్రాణాంతక వ్యాధుల నుండి తప్పించుకునే వీలుందని చెప్తున్నారు. అన్ని విషయాలలోనోనోూ టెన్షన్ పడేవారు వృత్తి వ్యాపారాల్లో ముందుంటారనీ, తాము ఎక్కడ వెనకపడతామో అన్న అప్రమత్తతో ఉంటారని అంటున్నారు.
 
తద్వారా ఆర్థిక సమస్యలు వీరిని దరిచేరే అవకాశం తక్కువని వారు చెప్తున్నారు. ఇలా ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉండే మహిళ్ళల్లో ఆరోగ్య సమస్యలు తక్కువగానే కనబడుతాయి. ఇన్ని లాభాలకు మూలమైన టెన్షన్ స్త్రీల విషయంలో మంచే చేస్తుందన్నది వైద్యుల సూచన.