గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (10:25 IST)

నీరసంగా వున్నారా? ద్రాక్షపండ్ల రసాన్ని తాగేయండి..

నీరసంగా వున్నారా? ద్రాక్షపండ్ల రసాన్ని తాగేయండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్షపండ్లలో శరీరానికి కావాల్సిన కొన్ని పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. ఈ పండ్లలో అధిక మోతాదు గల పోషకాలు నీరసాన్ని దూరం

నీరసంగా వున్నారా? ద్రాక్షపండ్ల రసాన్ని తాగేయండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్షపండ్లలో శరీరానికి కావాల్సిన కొన్ని పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. ఈ పండ్లలో అధిక మోతాదు గల పోషకాలు నీరసాన్ని దూరం చేస్తాయి. ద్రాక్ష రసం తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే కార్పోహైడ్రేట్‌, సిట్రిక్‌ ఆసిడ్‌, ప్రోటీనులు, ఐరన్‌, పొటాషియం వంటి పోషకాలు లభ్యమవుతాయి. ఈ పండ్లనుగానీ, ఈ పండ్లతో తయారుచేసే రసాన్ని గానీ తరుచుగా తీసుకుంటే.. అనారోగ్య  సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
ద్రాక్ష రసంలో కొద్దిగా పంచదార కలిపి పరిగడుపున తాగితే.. అల్సర్‌, పొట్ట రుగ్మతలు దూరమవుతాయి. ముఖ్యంగా నాలుగు పదులు నిండిన మహిళల్లో నెలసరి సమస్యలు తలెత్తితే.. రోజూ ద్రాక్షరసం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. రోజూ ఈ పండ్లరసాన్ని తాగితే.. ఎముకలు, దంతాలు బలపడతాయి. అలాగే గుండె ఆరోగ్యంగా వుంటుందని వారు సూచిస్తున్నారు.